Begin typing your search above and press return to search.

అప్పటిదాకా ఏపీ బీయారెస్ అంతేనా...?

By:  Tupaki Desk   |   27 Jan 2023 7:00 AM GMT
అప్పటిదాకా ఏపీ బీయారెస్ అంతేనా...?
X
ఏపీలో బీయారెస్ కధ ఏంటి అంటే అక్కడే అన్నట్లుగా ఉంది సీన్. సంక్రాంతి తరువాత ఏపీలో దున్నేస్తామని, టోటల్ గా రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది అని తెగ ఊదరగొట్టారు. కానీ జనవరి నెల మెల్లగా వెళ్ళిపోతోంది కానీ బీయారెస్ అలికిడి హడావుడి మాత్రం ఎక్కడా లేదు అనే అంటున్నారు.

కొత్త ఏడాది 2023 రావడంతోనే బీయారెస్ ఏపీలో తన మార్క్ చూపించేలా పావులు కదిపింది. జనసేనలో ఉన్న తోట చంద్రశేఖర్ ని తెచ్చి ప్రెసిడెంట్ కి చేసింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుతో పాటు పార్ధసారధి అనే మరో నేతను తెచ్చి కండువాలు కప్పింది. ఆ తరువాత ఖమ్మంలో భారీ సభ పెడితే ఏపీ నుంచి కూడా కొంతమంది వెళ్ళి వచ్చారు.

జనవరిలోనే ఏపీ నుంచి బీయారెస్ లో చేరికలు వెల్లువలా ఉంటారని ప్రచారం సాగింది. తనకు వరసబెట్టి ఫోన్లు వస్తున్నాయని అన్ని పార్టీల నుంచే నేతలు వచ్చి చేరాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అని కేసీయార్ చెప్పినట్లుగా కధనాలు వచ్చాయి. అక్కడితో అగలేదు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ వైపుగా చూస్తున్నారు అని షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.

దాంతో నిజమేనా అనుకున్నారు. ఇక కేసీయార్ ఉత్తర కోస్తా మీద ఫుల్ ఫోకస్ పెట్టారని, తన పాత పరిచయాలు పూర్వం పనిచేసిన తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాలు వెరసి ఏపీలో బీయారెస్ జెండా పాతేయడం ఖాయమని అంచనా కట్టారు. బిగ్ షాట్స్ ఈ వైపు వస్తారని అనుకున్నారు.

అయితే అదంతా ఇపుడు నిజమో కాదో తెలియడంలేదు అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడం వల్లనే కేసీయార్ ఇతర రాష్ట్రాలలో మీటింగ్స్ పెట్టేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరి ఏపీకి కేసీయార్ ఎపుడు వస్తారు బీయారెస్ సభ ఎపుడు జరుగుతుంది అంటే మార్చి తరువాతనే అని అంటున్నారు.

అంటే తెలంగాణాలో బడ్జెట్ సెషన్ అయిన తరువాతనే కేసీయార్ ఏపీ వైపు చూస్తారు అని తెలుస్తోంది. ఈలోగా బీయరెస్ ఆఫీస్ ని పారంభించే కార్యక్రమం ఉంటే ఉండొచ్చు అని అంటున్నారు. ఇక ఏపీ బీయారెస్ లోకి చేరికలు ఉంటాయా ఉంటే ఎవరు చేరుతారు ఎపుడు చేరుతారు అంటే దాని మీద రకరకాల కధనాలు వినిపిస్తున్నాయి.

ఏపీలో ఎన్నికలు వచ్చే ఏడాది తొలి సగంలో ఉన్నాయి. అంటే నింపాదిగా ప్రస్తుతం రాజకీయం ఉంది. దాంతో అర్జంటుగా గోడ దూకుళ్ళకు ఎవరూ దిగడంలేదు అంటున్నారు. ఇక ఏపీలో పొత్తులు ఎత్తులు రాజకీయ పార్టీల మధ్య అలాగే ఉన్నాయి. అవి ఒక కొలిక్కి రాలేదు. ఇక వైసీపీ కూడా కోత పెట్టే ఎమ్మెల్యేలు ఎవరూ అన్నది ఇపుడే చెప్పదని అంటున్నారు. అంతా డిసెంబర్ లోనే అని అంటున్నారు.

దాంతో జంపింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ముందు ఏపీలో అవకాశాలను చూసుకుంటారు. తమకు సరితూగే పార్టీలలో చేరేందుకు ప్రయత్నిస్తారు. అక్కడ సమీకరణలు కుదరకపోతేనే బీయారెస్ వైపు చూస్తారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే బీయారెస్ లో చేరేందుకు కూడా ఒక టెస్టింగ్ పాయింట్ ఉందిట. బీయారెస్ తెలంగాణాలో గెలిస్తే ఏపీలో విస్తరించేందుకు ఊపు దొరుకుతుందని, అపుడు అంగబలం అర్ధబలం కూడా దక్కుతాయని ఆశిస్తున్న వారు ఉన్నారు.

ఒకవేళ తెలంగాణాలో మూడవసారి అధికారంలోకి రాకపోతే ఏపీలో బీయారెస్ వ్యవహారం కూడా మారుతుందని ముందు చూపుతో ఆలోచించే వారు అంతా వెయింటింగ్ లిస్ట్ లో పెడుతున్నారుట. అయితే మరో కధనం ప్రకారం చూస్తే చాలా మంది నేతలు టచ్ లో ఉన్నా టైం కావాలని అడిగారని, తమ పేర్లను బయటకు చెప్పవద్దు అని అన్నారని, అవి బీయారెస్ అధినాయకత్వానికే తెలుసు అని సరైన సమయంలో ఏపీలో బీయారెస్ విస్తరణ జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.