Begin typing your search above and press return to search.

ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యం బాస్..

By:  Tupaki Desk   |   14 Feb 2020 6:00 AM GMT
ఇలాంటివి కేసీఆర్ కు మాత్రమే సాధ్యం బాస్..
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెమరీ చిప్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు పరిచయమైన వారిని ఆయన అస్సలు మర్చిపోరు. తన జీవన ప్రయాణంతో తనకు దగ్గరగా వచ్చిన వారిని ఆయన అస్సలు మర్చిపోరు. చివరకు చిన్ననాటి చెడ్డీ దోస్తులతో సహా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. చిన్నప్పటి స్నేహితుల్ని.. వారితో తనకున్న అనుబంధాన్ని ఆయన మర్చిపోరు.

అవకాశం వచ్చిన ప్రతిసారీ వారిని గుర్తించి..వారి మనసుల్లో నిలిచిపోయేలా చేస్తుంటారు. సాధారణంగా సినిమాల్లో మాత్రమే కనిపించే సీన్లను కేసీఆర్ రియల్ లైఫ్ లోనూ కనిపించేలా చేస్తుంటారు. తాజాగా తన కరీంనగర్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నడుస్తున్నారు. జనాల్లో తన చిన్ననాటి స్నేహితుడ్ని చూశాడు. వారిద్దరూ కలిసి చదువుకున్నారు.

తర్వాతి కాలం లో ఒకరికొకరు సంబంధం లేనట్లుగా ఉండిపోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. అతడి స్నేహితుడు సగటు జీవిగా మిగిలిపోయాడు. అయితే.. తన హోదాను.. మిగిలిన విషయాల్ని వదిలేసి.. తన మిత్రుడు కనిపించినంతనే.. ఏయే నర్సయ్య ఇట్రా..గాయన మా దోస్తయా.. జర రానీయిండ్రీ అని తన సెక్యురిటీకి చెప్పటంతో వారు తెల్లటి గుబురు గడ్డంతో ఉన్న నర్సయ్యను కేసీఆర్ వద్దకు అనుమతించారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్.. తనను గుర్తు పట్టి దగ్గర కు పిలవటంతో ఆనందం తో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. నర్సయ్య యోగక్షేమాలతో పాటు.. పలు వివరాల్ని అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. అంతమందిలో తనను గుర్తు పట్టి దగ్గరకు పిలిచిన కేసీఆర్ తీరుకు నర్సయ్య ఫుల్ ఫిదా అయిపోయారు.