Begin typing your search above and press return to search.
బావ రాకున్నా బాలయ్య కోసం కేసీఆర్ వచ్చారు
By: Tupaki Desk | 22 April 2016 10:20 AM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా సాగింది... సినీరాజకీయ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో భిన్నధ్రువాలన్నీ కనిపించాయి. అయితే... బాలయ్య వియ్యంకుడు, బావ అయిన ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఇందులో కనిపించలేదు. ఆయన వస్తారని మొదటి నుంచి అనుకున్నా కూడా ఈ భారీ ఆరంభ కార్యక్రమానికి ఆయన అటెండ్ కాలేదు. అయితే... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ఆ లోటు భర్తీ చేసేశారు. బాలయ్యను - బాలయ్య తండ్రి ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు. తాను బాలయ్య అభిమానినని చెప్పుకొంటూ మొట్టమొదటగా ఈ సినిమా చూసే అవకాశాన్ని తనకు కల్పించాలంటూ బాలయ్యను కోరారు కూడా. కేసీఆర్ ఒక్కే కాకుండా మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ - ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు - రాఘవేంద్ర రావు వంటి హేమాహేమీలు రావడంతో కార్యక్రమం కలర్ ఫుల్ గా సాగింది.
తొలుత ఈ కార్యక్రమానికి రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు వస్తారని అంతా అనుకున్నారు. బాలయ్య కొద్దిరోజుల కిందట నేరుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలంటూ ఆహ్వానించారు. మరోవైపు చంద్రబాబు కూడా వస్తారని అనుకున్నారు. ఒకవేళ కేసీఆర్ రాకపోయినా చంద్రబాబు రావడం గ్యారంటీ అని భావించారు. కానీ సీన్ రివర్సైంది. చంద్రబాబు రాకపోగా కేసీఆర్ హాజరై అంతా తానై అల్లుకుపోయారు. దీంతో కేసీఆర్ ను స్వయంగా వెళ్లి ఆహ్వానించిన బాలయ్య ఎంతగానో మురిసిపోయారట.
మరోవైపు బాలయ్య వ్యవహారంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. బాలయ్య తరచూ కేసీఆర్ ను కలుస్తున్నారు. ఇది బాలయ్య అత్యుత్సాహంతో జరుగుతున్నదా.. లేదంటే చంద్రబాబు సూచనలతో వ్యూహాత్మక ఎత్తుగడా అన్న చర్చలు జరుగుతున్నాయి. బసవతారకం ఆసుపత్రి స్థలానికి చెందిన వ్యవహారంలో ఒకసారి... ఆ తరువాత లేపాక్షి ఉత్సవాలకు పిలవడానికి బాలయ్య వెళ్లి కేసీఆర్ ను కలిశారు. తాజాగా తన 100 సినిమాను ప్రారంభించాల్సిందిగా కూడా కేసీఆరే పిలిచారు బాలయ్య. రాజకీయంగా టీఆరెస్ - టీడీపీల మధ్య గ్యాప్ ఉన్న నేపథ్యంలో బాలయ్య తీరు చాలామందిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే... విభజన నేపథ్యంలో తన సినిమాలపై ఎలాంటి వ్యతిరేక ప్రభావం రాకుండా కేసీఆర్ ఇమేజ్ తో గ్రాండ్ సక్సెస్ చేసుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారన్నది ఒక వాదన కాగా.. బాలకృష్ణను అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకోమంటూ కేసీఆర్ కు చంద్రబాబు సలహా ఇచ్చారని, ఆ ప్రకారమే ఇద్దరు కలిసి తరచూ కనిపిస్తున్నారని వినిపిస్తోంది. ఈ రాజకీయాలన్నీ ఎలా ఉన్నా కూడా తన 100 చిత్రానికి మాత్రం కేసీఆర్ వంటి పాపులర్ పర్సన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశారు బాలయ్య. చిత్ర ప్రారంభోత్సవానికి వచ్చి కేసీఆర్ అదరగొట్టగా... మళ్లీ సినిమా తొలి ప్రివ్యూకు కూడా వస్తానని చెప్పడంతో అప్పుడు కూడా మరోసారి కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ బాలయ్యకు దక్కనుంది.