Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిన కేసీఆర్

By:  Tupaki Desk   |   17 Sep 2015 4:58 AM GMT
ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిన కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మై హోం రామేశ్వర్ రావుకు మధ్య ఎంతటి గాఢమైన మైత్రి ఉందన్న విషయం మరోసారి నిరూపితమైంది. పది రోజులు పాటు జరిపిన విదేశీ పర్యటన తర్వాత ఇంటికి వెళ్లాకే మరో చోటకు వెళుతుంటారు. కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా నేరుగా తన మిత్రుడైన రామేశ్వర్ రావు షష్ఠి పూర్తి కార్యక్రమానికి వెళ్లటం చూస్తే వారి మధ్య మిత్రబంధం ఎంతటిదో ఇట్టే అర్థమవుతుంది.

పది రోజుల చైనా పర్యటనను ముగించుకొని బుధవారం రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందించేందుకు.. స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నేతలు.. ఉన్నతాధికారులు.. కార్యకర్తలు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న కేసీఆర్ బయటకు వచ్చి కొద్దిసేపు మాత్రమే గడిపిన ఆయన.. అక్కడ నుంచి నేరుగా తనకు అత్యంత సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావు షష్టి పూర్తి కార్యక్రమానికి వెళ్లిపోయారు. తన తాజా చర్య ద్వారా మైహోం రామేశ్వరరావు తనకెంత సన్నిహితుడన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పినట్లైంది.