Begin typing your search above and press return to search.
మోడీని కేసీఆర్ ఏం అడిగారంటే..
By: Tupaki Desk | 19 July 2016 4:53 AM GMTప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. పార్లమెంటు భవనంలో దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ఏకాంత సమావేశంలో చాలా విషయాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధానికి తెలంగాణ ముఖ్యమంత్రి కోర్కెల చిట్టాను ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే.. తొలుత హైకోర్టు విభజన అంశంపై బలమైన వాదనను వినిపించటమే కాదు.. భావోద్వేగ బాణాన్ని కూడా బయటకు తీసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పిన ఆయన.. కేంద్రం సత్వరమే స్పందించాలన్నారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు అయినా హైకోర్టు విభజన పూర్తి కాకపోవటం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. దీని కారణంగా అనేక సమస్యలు వస్తున్నట్లుగా వెల్లడించారు.
మోడీతో భేటీ సందర్భంగా హైకోర్టు విభజన అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన కేసీఆర్.. ఆ విషయం మీదనే ఎక్కువసేపు మాట్లాడటమే కాదు.. హైకోర్టు ఇష్యూ మీద మోడీ నుంచి స్పష్టమైన హామీని పొందినట్లుగా చెబుతున్నారు. హైకోర్టు విభజన అవసరాన్ని చెప్పటంతోపాటు.. హైకోర్టులో జడ్జిలు.. ఉద్యోగుల ఎంపికలో తెలంగాణకు మొదటి నుంచి జరుగుతున్న అన్యాయాన్ని సుదీర్ఘంగా వివరించినట్లుగా చెబుతున్నారు.
రెండు రాష్ట్రాలకు వేర్వేరు భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పిన ఆయన.. ఈ సమస్యను పరిష్కరించాలని కోరటం.. దీనికి మోడీ ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. ఇక.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు అయినా తెలంగాణ రాష్ట్రానికి రాలేదని.. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రావాలంటూ కేసీఆర్ కోరికను మోడీ ఓకే చేసినట్లుగా చెబుతున్నారు. ఆగస్టు 7న షురూ చేయనున్న మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రావాలని కోరినట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో కరీంనగర్ జిల్లాలోని ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రానికి భూమి పూజ.. వరంగల్ లో కాళోజీ ఆరోగ్య వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న కేసీఆర్.. నీతి అయోగ్ సూచన మేరకు మిషన్ భగీరథకు రూ.19,820 కోట్లు.. మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరినట్లుగా చెబుతున్నారు. వీటితో పాటు ఎఫ్ ఆర్ బీఎంలో రుణపరిమితి పెంపు (దీంతో మరిన్ని అప్పులు చేసేందుకు వీలు కలుగుతుంది) విభజన చట్టంలోని తొమ్మిదో.. పదో షెడ్యూల్ సంస్థ విభజన.. జల వివాదాల్ని పరిష్కరించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. తన ముందు ఉంచిన కోర్కెల చిట్టా పట్ల సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో కేసీఆర్ ను ప్రశంసించినట్లుగా తెలుస్తోంది.