Begin typing your search above and press return to search.

ఇక‌.. కేసీఆర్ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి

By:  Tupaki Desk   |   6 Sep 2018 9:02 AM GMT
ఇక‌.. కేసీఆర్ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి
X
నాలుగేళ్ల‌కు పైనే సీఎం కేసీఆర్ గా బాగా సుప‌రిచిత‌మైన ప‌దం ఇక‌పై ప‌రాయి కానుంది. ఇంత‌కాలం ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌కున్న అధికారులు ఈ మ‌ధ్యాహ్నం నుంచి ప‌రిమితం కానున్నాయి. త‌న‌కు తానుగా తీసుకున్న నిర్ణ‌యంతో ముఖ్య‌మంత్రి కాస్తా ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా మారిపోయారు. త‌న మాటే వేదంగా.. త‌న ప్ర‌తి నిర్ణ‌యాన్ని శాస‌నంగా మార్చ‌ట‌మే కాదు.. పార్టీ నేత‌లు మొద‌లు అధికార‌వ‌ర్గాల వ‌ర‌కూ అంద‌రిని త‌న కంటి చూపుతో శాసించిన కేసీఆర్ కు ఇప్పుడు ప‌రిమిత అధికారాలు మాత్ర‌మే ఉండనున్నాయి.

అదే స‌మ‌యంలో.. ఆయ‌న చెప్పిన‌ట్లుగా ఇంత‌కాలం ప‌ని చేసిన అధికారులు ఇప్పుడు ఎంత‌వ‌ర‌కూ స‌హ‌క‌రిస్తార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌గా మారింది. అయితే.. త‌న అధికారంతో కంట్రోల్ చేసిన కేసీఆర్‌.. గాలి త‌న‌కు వీస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని క‌ల్పించినంత కాలం ఇబ్బంది లేద‌ని.. ఆ విష‌యంలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఇబ్బందేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. వాటిని అమ‌లు చేసేందుకు ఉరుకులు ప‌రుగులు పెట్టించిన అధికార యంత్రాంగం.. రానున్న రోజుల్లో కేసీఆర్ కు ఎంత మేర స‌హ‌కారం అందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇంత‌కాలం త‌మ‌కు తిరుగులేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన మంత్రులు.. అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలంతా ఇవాల్టి నుంచి మాజీలు అయిపోయారు. ఇంత‌కాలం న‌డిచిన హ‌వాకు.. ఇక‌పై న‌డిచే తీరుకు వ్య‌త్యాసం ఎంత‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.