Begin typing your search above and press return to search.
ఉమ్మడి లెక్క విడిపోయాక కూడానా కేసీఆర్?
By: Tupaki Desk | 10 May 2016 4:50 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీల్ని అర్థం చేసుకోవటానికి నేరుగా పాయింట్లోకి వెళ్లే కన్నా.. కొన్ని అంశాలతో పోలిక పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే సమస్య తీరుతెన్నులు మరింత బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే.. ఆ నలుగురి సామర్థ్యాలు ఒకేతీరులో ఉండవు. ఒకరు బాగా తెలివితేటలు ఉంటే.. అంతే తెలివితేటలు మిగిలిన ముగ్గురిలో ఉండనే ఉండవు. ఉమ్మడి కుటుంబం అయినప్పుడు.. ఒకరి బలం.. మరొకరి బలహీనతను కప్పిపుచ్చేస్తుంటాయి. వారి విజయం.. అపజయం రెండూ ఉమ్మడి ఖాతాలోనే కనిపిస్తుంటాయి. ఒకరి లోపాన్ని మరొకరు కవర్ చేస్తూ... మొత్తంగా ఒకటిగా ఉండే ప్రయత్నం చేస్తారు. అంటే.. ఎవరికి వారుగా ఉన్నప్పటికీ.. ఉమ్మడిగా వారు కలిసి ఉండటం వారికున్న ఇబ్బందుల్ని తగ్గించేలా చేస్తుంది.
అయితే.. ఈ బలాలన్నీ వారంతా కలిసి ఉన్నప్పుడే. ఒకసారి వారు విడిపోయిన తర్వాత ఎవరి లెక్కలు వారివే అవుతాయి. కలిసి ఉన్నప్పుడు వినించే ‘మన’ మాట.. విడిపోయిన తర్వాత ‘నేను’గా మారుతుంది. మాటలోనే కాదు.. ప్రాధాన్యతలు కూడా మారిపోతుంటాయి. ఒక కుటుంబంలోని నలుగురి మధ్యనే ఇంత మార్పు ఉంటే.. రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఈ తేడాలు ఎంత ఎక్కువగా ఉంటాయి? అందులోకి.. ఉమ్మడిలో ఉన్నప్పుడే విరుద్ధ భావజాలం ఉన్న అంశాలు.. విడిపోయిన తర్వాత ఎన్ని తిప్పలు తెచ్చి పెడుతుందన్నది తాజాగా నెలకొన్ని ప్రాజెక్టుల పంచాయితీల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
తాను షురూ చేసిన ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ఒకలా ఉంటే.. ఏపీ అధికార.. విపక్షాల మాట మరోలా ఉంది. ప్రాజెక్టుల గురించి ఆ మధ్య మాట్లాడిన కేసీఆర్.. ‘‘బతుకు.. బతకనివ్వు’’ అన్న సిద్ధాంతంలోనే తాము వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే మాట నిజమైతే.. ప్రాజెక్టుల పంచాయితీలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే లెక్కలు ఒక కొలిక్కి వచ్చేవి అనటంలో ఎలాంటిప సందేహం లేదు. కానీ.. అందుకు భిన్నంగా విమర్శల పదును పెంచుకుంటూ మాటలదాడిని ముమ్మురం చేయటం ద్వారా సమస్య పరిష్కారం అయ్యే కన్నా పీటముడే పడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
తాజాగా పాలమూరు ఎత్తిపోతల పథకంతో పాటు.. మరికొన్ని ప్రాజెక్టుల్ని తెలంగాణ సర్కారు రీడిజైనింగ్ చేయటం తెలిసిందే. తాను చేసిన రీడిజైనింగ్ మీద ఏపీ అధికార.. విపక్ష అధినేతలు వ్యతిరేకించటం మీద కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణను దెబ్బ తీసేలా చంద్రబాబు.. జగన్ లు వ్యవహరిస్తున్నారని.. తాము ప్రారంభించిన పాలమూరు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలో మొదలెట్టిన ప్రాజెక్టుగా చెబుతున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఉమ్మడిగా ఉన్నప్పుడు.. ఒకరి బలహీనతను బలమైనోడు కవర్ చేస్తారని.. అదే సమయంలో విడిపోతే అలాంటి వెసులుబాటు ఉండదన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే చూసే కేసీఆర్.. తన కోణంలోనే ఏపీ ముఖ్యమంత్రి.. విపక్ష నేతను చూడాలని కోరటం అర్థం లేనిది.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఆయనకు ఎంత ముఖ్యమో.. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు ఏపీ ముఖ్యమంత్రి.. విపక్ష నేతకు అంతే ముఖ్యమన్న విషయాన్ని మరచిపోకూడదు. అందుకే.. ఉమ్మడిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల్ని విడిపోయిన తర్వాత ప్రస్తావించటంలో అర్థం లేదు. ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం మీద వచ్చే ఆదాయం ఏపీ ప్రాంతానికి దన్నుగా నిలిచేది. మరి.. విడిపోయిన తర్వాత హైదరాబాద్ నగరం మీద వచ్చే ఆదాయం మొత్తం తెలంగాణ ప్రభుత్వానికే చెందుతున్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఆదాయం ఏపీకి అండగా ఉండేదని.. విడిపోయిన తర్వాత కూడా అలానే ఉండాలని కోరుకోవటం ఎంత అత్యాశో.. ప్రాజెక్టు విషయంలో తమ ప్రయోజనాల్ని ఏపీ ముఖ్యమంత్రి.. విపక్ష నేతలు కాపాడాలని కోరటం అర్థం లేనిది. విడిపోయిన తర్వాత ఎవరి పంచాయితీలు వారివేనన్న విషయాన్ని అస్సలు పట్టించుకోనట్లుగా వ్యవహరించే కేసీఆర్.. తన మాటలతో సమస్యల్ని జఠిలం చేస్తున్నారే తప్పించి.. వాటిని పరిష్కరించుకునేలా వ్యవహరించటం లేదన్నది మర్చిపోకూడదు. ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్యనున్న పంచాయితీల్ని చర్చల ద్వారా తేలిస్తే బాగుంటుందే తప్పించి.. ఉమ్మడి చరిత్రలోకి వెళితే.. ముడి మీద ముడి పడటమే కాదు.. చివరకూ ఏ లెక్కా తేలకుండా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.