Begin typing your search above and press return to search.
దొడ్డు బియ్యంపై కేంద్రానికి కేసీఆర్ విజ్ఞప్తి
By: Tupaki Desk | 27 Sep 2021 11:32 AM GMTఢిల్లీ పర్యటనలో రెండు రోజులుగా బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ కేంద్రం ముందు పలు వినతులను పెడుతున్నాడు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డు బియ్యం కొనుగోలుపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని.. ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది.
అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటి కొనసాగింది. అంతకుముందు కేంద్రజలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో కేసీఆర్ సమావేశమయ్యారు.
సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్ నగర్ జిల్లాకు జరుగుతున్న నష్టం.. కృష్ణా జలాల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతోపాటు నీటి కేటాయింపులు జరపాలని కేంద్రమంత్రిని కోరారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలు తేది వాయిదాను మరోసారి షెకావత్ వద్ద ప్రస్తావించారు.
ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం కోరారు. మరోవైపు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం అనంతరం కొందరు సీఎంలతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటి అయ్యారు.