Begin typing your search above and press return to search.

అత్యవసర సేవకులకు కేసీఆర్‌ గిఫ్ట్‌!

By:  Tupaki Desk   |   6 April 2020 3:06 PM GMT
అత్యవసర సేవకులకు కేసీఆర్‌ గిఫ్ట్‌!
X
కరోనా వైరస్‌ కట్టడిలో నిరంతరం శ్రమిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అత్యావసర సేవల్లో మునిగిన వారికి నగదు ప్రోత్సాహాకం ప్రకటించారు. కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తున్న సందర్భంలో.. లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తున్న వైద్యులు - వైద్య సిబ్బంది - పారిశుద్ధ్య కార్మికులు - తాగునీటి సరఫరా చేసే వారికి కొంత కొంత నగదు ప్రోత్సాహకం ఇచ్చారు. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులు వెల్లడిస్తూనే లాక్‌ డౌన్‌ అమలుపై సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

వైద్యులు - వైద్య సిబ్బందికి మూల వేతనంలో పది శాతం అదనపు వేతనం ముఖ్యమంత్రి నగదు బహుమతిగా ఇచ్చారు. వీరితోపాటు జీహెచ్‌ ఎంసీ - హెచ్‌ ఎం డబ్ల్యూఎస్‌ ఎస్‌ బీ కార్మికులకు రూ.7,500 ముఖ్యమంత్రి సహాయం కింద ప్రకటించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టారు. వారి సేవలతోనే ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో 329 మందికి కరోనా వైరస్‌ సోకిందని - 11 మంది మృతి చెందారని ప్రకటించారు. మొత్తం 50 మంది కోలుకోని డిశ్చా‍ర్జయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా లాక్‌ డౌన్‌ రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. లాక్‌ డౌన్‌ పొడిగించాలని కొనసాగించేందుకు తాను మద్దతు ప్రకటిస్తామన్నారు. లాక్‌ డౌన్‌ వలనే ఇప్పుడు దేశం కొంత సురక్షితంగా ఉందని పేర్కొన్నారు.