Begin typing your search above and press return to search.

కులాల‌ లెక్క‌లు ప‌సిగట్టి కేసీఆర్ వేసిన స్కెచ్ ఇది

By:  Tupaki Desk   |   5 March 2017 10:40 AM GMT
కులాల‌ లెక్క‌లు ప‌సిగట్టి కేసీఆర్ వేసిన స్కెచ్ ఇది
X
ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో మేటి అయిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మ‌రో పాచిక వేశారు. శాసన మండలిలో ఎన్నికలు జరిగే స్థానాలకు, త్వరలో ఖాళీ ఏర్పడే స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ప్రధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ స‌హా టీడీపీ - బీజేపీ ఇంకా ఆలోచ‌న చేయ‌క‌ముందే కేసీఆర్ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి పోటీలో ముందు నిలిచారు. ఇందులోనూ కుల స‌మీక‌ర‌ణ‌ల‌ను ప‌క్కాగా చూసుకున్నారు. తెలంగాణ శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాలకు - స్థానిక సంస్థల కోటా కింద ఒక స్థానానికి - ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఒక స్థానానికి ఎన్నిక కోసం నోటిఫికేషన్ వెలువడింది. గవర్నర్ కోటా కింద త్వరలోనే రెండు ఖాళీలు ఏర్పడుతున్నాయి.

ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎన్నికలకు టీఆర్ ఎస్ అభ్యర్థులుగా నిజామాబాద్ జిల్లాకు చెందిన వి.గంగాధర్ గౌడ్ - న‌ల్ల‌గొండ‌కు చెందిన‌ ఎలిమినేటి కృష్ణారెడ్డి - మెద‌క్ జిల్లాకు చెందిన‌ మైనంపల్లి హన్మంతరావు పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. గవర్నర్ కోటా కింద ఏర్పడే రెండు ఖాళీలకు డి.రాజేశ్వర్ రావు - ఫారూఖ్ హుస్సేన్ పేర్లను ప్రభుత్వం తరఫున ప్రతిపాదించాలని సీఎం నిర్ణయించారు. స్థానిక సంస్థల కోటా నుంచి మిత్రమిక్షమైన ఎం.ఐ.ఎం.కు చెందిన సయ్యద్ అమీనుల్ అసద్ జాఫ్రీకి టీఆర్ ఎస్ మద్దతిచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోటా నుంచి జరిగే ఎన్నికకు కాటేపల్లి జనార్థన్ రెడ్డిని టిఆర్ ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థిగా ప్రకటించింది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను ముస్లిం సామాజిక వర్గానికి రెండు, రెడ్డి సామాజిక వర్గానికి రెండు - క్రిస్టియన్లకు ఒకటి - బీసీలకు ఒకటి - వెలమ సామాజిక వర్గానికి ఒకటి చొప్పున దక్కినట్లయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టిఆర్ ఎస్ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కర్తలుగా సిఎం ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/