Begin typing your search above and press return to search.

సెలవులు ఇవ్వాలంటే కేసీఆర్ తర్వాతే?

By:  Tupaki Desk   |   12 Oct 2015 4:14 AM GMT
సెలవులు ఇవ్వాలంటే కేసీఆర్ తర్వాతే?
X
ఏదైనా సరే.. చటుక్కున నిర్ణయాలు తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే. కొన్ని విషయాలకు సంబంధించి ఆయన పెద్దగా ఆలోచించరు. అనవసరంగా సమయాన్ని వృధా చేయరు. మనసులోకి వచ్చిన ఆలోచనను వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. పాలనకు సంబంధించిన విషయాల్లో ఇలాంటి స్పీడ్ ను ప్రదర్శించే కేసీఆర్.. సెలవులు ప్రకటించే విషయంలోనూ ఉదారంగా ఉంటారు.

మిగిలిన ప్రభుత్వాధినేతలు సెలవుల విషయంలో కాస్త కఠినంగా ఉంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలకు సెలవులు ఇచ్చే విషయంలోనూ కిందామీదా పడి.. తర్జన భర్జనలు చేస్తుంటారు. కానీ.. కేసీఆర్ విషయంలో అలాంటివి అస్సలు కనిపించవు.

తాజాగా.. బతుకమ్మ ఉత్సవాల్ని చూస్తే కొద్దిపాటి ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఎందుకంటే బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా మొదటి రోజును సెలువుదినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఉత్సవాలకు.. ముగింపు రోజును సెలవుగా ప్రకటిస్తారు. తెలంగాణ పండుగగా నిర్వహించే బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఇందుకోసం రూ.10కోట్ల నిధుల్ని కూడా విడుదల చేశారు. ఈ పండుగ నిర్వహణ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ నెల 20 వరకు నిర్వహించే ఈ పండుగ ప్రారంభ దినాన సెలవు ప్రకటించి తెలంగాణ రాస్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు దోచుకున్నారని చెప్పొచ్చు. పండుగ వేళ.. పని చేయటం కాస్తంత ఇబ్బందే. ఆ విషయాన్ని ఉద్యమాధినేత గుర్తించటానికి మించిన ఆనందం ఇంకేం ఉంటుంది.