Begin typing your search above and press return to search.
డబుల్ బెడ్రూం... కేసీఆర్ మానసపుత్రిక
By: Tupaki Desk | 16 Feb 2016 9:42 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్ అనంతరం జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ...ప్రపంచలోనే మనం పారిశ్రామిక విధానంలో అత్యుత్తమ టీఎస్ ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చామని తద్వారా హైదరాబాద్ కు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అలా వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలకు జిల్లాలకు కూడా తీసుకురావాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు.
ఈ సందర్బంగా ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాల్సి ఉందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వర్గాలు వేలుకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు పెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తాను ఇటీవల ఢిల్లీ వెళ్లినపుడు ఈ విషయమై ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశానని కేసీఆర్ ప్రస్తావించారు. త్వరలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై నిర్ణయం చెబుతామని మోడీ హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఖమ్మంలో వర్షపాతం బాగానే ఉందని, మిషన్ కాకతీయ పనులు బాగా జరిగాయని కితాబిచ్చారు. రూ.40 వేల కోట్లతో ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా పథకాన్ని చేపట్టినట్టు కేసీఆర్ వివరించారు.
ఖమ్మం జిల్లాకు డబుల్ బెడ్రూంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే 2వేల ఇళ్లు మంజూరు చేశామని పేర్కొంటూ మరో 3వేల ఇళ్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్త డంపింగ్ యార్డును నిర్మిస్తామని, ముస్లింలకు రూ. 2కోట్లతో షాదీఖానా నిర్మించున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తరువాత మళ్లీ ఖమ్మంలో పర్యటిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలంగా ఆలోచన చేస్తున్నదని చెప్పారు.
ఇదిలాఉండగా కేసీఆర్ ఖమ్మం పర్యటనలో ఉండగానే ఆ మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ లు ఖరారు కావడం విశేషం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 50 డివిజన్లు కాగా రిజర్వేషన్ల వారీగా డివిజన్ల వివరాలివి...
ఎస్టీ జనరల్ (1): 1వ డివిజన్
ఎస్టీ ఉమెన్ (1): 38వ డివిజన్
ఎస్సీ జనరల్ (3): 4, 28, 49 డివిజన్లు
ఎస్సీ ఉమెన్ (3): 20, 27, 32 డివిజన్లు
బీసీ జనరల్ (9): 6, 7, 12, 16, 18, 26, 29, 47, 48 డివిజన్లు
బీసీ ఉమెన్ (8): 33, 40, 41, 42, 43, 44, 46, 50 డివిజన్లు
ఉమెన్ జనరల్ (13): 3, 9, 10, 11, 13, 15, 17, 19, 23, 31, 34, 35, 45 డివిజన్లు
అన్ రిజర్వుడ్ (12): 2, 5, 8, 14, 21, 22, 24, 25, 30, 34, 37, 39 డివిజన్లు