Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు కోపం వచ్చేలా తాజా ఆర్థిక సంఘం సిఫార్సులు
By: Tupaki Desk | 10 Nov 2020 4:00 AM GMTకేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలపైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నింటికంటే ముఖ్యంగా మోడీ హయాంలో రాష్ట్రాలకు అందాల్సిన నిధుల విషయంలో అనుసరిస్తున్న విధానంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ సర్కారు తీరుపై ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే కాదు.. మంత్రి కేటీఆర్ సైతం తరచూ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా 15వ ఆర్థిక సంఘం నివేదికను విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం కట్టలు తెంచుకునే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
కోవిడ్ కారణంగా దెబ్బ తిన్న ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధులపైనా ప్రభావం చూపనుంది. ఇదే విషయాన్ని 15వ ఆర్థిక సంఘం నివేదిక స్పష్టం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రాలకు అందించే గ్రాంట్లలో కోత పడక తప్పదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆసక్తికకరమైన విషయం ఏమంటే.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎప్పటిలానే 41 శాతం ఉన్నప్పటికీ.. దాని కింద వచ్చే నిధుల లెక్కలో మాత్రం తేడా వచ్చేట్లుగా కనిపిస్తోంది.
ఉదాహరణకు తెలంగాణకుఈ ఏడాది స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో రూ.2736 కోట్ల స్థానిక సంస్థల గ్రాంట్ రాగా.. వచ్చే ఏడాది నుంచి అది రూ.2614 కోట్లకు పరిమితం కానుంది. అంటే.. రూ.121 కోట్ల వ్యత్యాసం. రానున్న ఐదేళ్లలో తగ్గున్న నిధులు ఏకంగా రూ.605 కోట్లు ఉండటం గమనార్హం. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కేంద్రానికి రావాల్సిన పన్ను ఆదాయం కోవిడ్ నేపథ్యంలో తగ్గనున్నట్లుగా పేర్కొన్నారు. దీంతో.. రాష్ట్రాలకుకేంద్రం నుంచి అందే నిధుల్లో కోత పడనుంది.
కేంద్ర పన్నుల్లో వాటాగా ఏపీకి 4.111 శాతంగా నిర్ణయిస్తే.. తెలంగాణకు 2.133శాతంగా నిర్ణయించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అందజేసే పన్ను ఆదాయం వాటా కంటే తాజాగా వాటా తగ్గనుంది. మామూలుగా అయితే ఏపీకి రావాల్సిన వాటా రూ.5897 కోట్లు కాగా.. కొత్త సిఫార్సుల ప్రకారం రూ.4599 కోట్లు మాత్రమే లభించనుంది. అంటే.. ఏటా రూ.1298 కోట్లు చొప్పున కోల్పోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
కోవిడ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వైద్యరంగానికి మౌలిక వసతుల కల్పన కింద ఆర్థిక సంఘం రూ.లక్ష కోట్ల గ్రాంట్ కు సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఏపీకి రూ.4వేల కోట్లు, తెలంగాణకురూ.2వేల కోట్లు దక్కే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. ఇప్పటికే కేంద్రం నుంచి అందే నిధులపై కోపంతో ఉన్న రాష్ట్రాలకు.. తాజాగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు కాలేలా చేస్తాయని చెప్పక తప్పదు.