Begin typing your search above and press return to search.
కేసీయార్... జగన్ ఒకేసారి బటన్ నొక్కేస్తారా...?
By: Tupaki Desk | 17 Jan 2023 1:30 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలు రెండు రకాల రాజకీయాలు. కానీ ఇపుడు ఒకే రూట్ లో సాగుతాయని అంతా అంటున్నారు. దానికి కారణం ఇద్దరి ఆలోచనలు ఒక్కటే కావడం అంటున్నారు. నాలుగేళ్ల పాలన చాలు అయిదేళ్ళూ వద్దు అని కేసీయార్ జగన్ అనుకుంటున్నారుట. పూర్తి కాలం అధికారంలో ఉంటే తమకు ఇబ్బందులు అని తలపోస్తున్నారుట. అందుకే ముందస్తు మంత్రం జపిస్తున్నారుట.
ఏపీలో జగన్ ముందస్తుకు వెళ్తారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. దానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముందుగా చెప్పుకుంటే ఆర్ధిక వ్యవస్థ. ఏపీ అప్పులతో లేచి అప్పులతో రోజు ముగిస్తోంది. ఖజానా ఖాళీ అయింది. హామీలే తప్ప ఆచరణకు నిధులు లేవు. దాంతో ఎన్నికలకు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా కనీసం పధకాలు పూర్తి చేశామని చెప్పుకోవచ్చు అని భావిస్తున్నారు అంటున్నారు.
మరో వైపు వివిధ వర్గాలలో పెరిగిపోతున్న అసంతృప్తిని అలాగే ఉంచుతూ ఎన్నికలకు వెళ్తే ఎంతో కొంత నష్టంతో బయటపడవచ్చునని ఆలోచిస్తున్నారుట. ఇక రాజకీయంగా చూస్తే విపక్షాలకు చాన్స్ ఇవ్వకూడదు అన్నది ఒక పంతం. లోకేష్ కి టైం ఇస్తే ఆయన నాలుగు వందల రోజుల పాటు నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి జగన్ రికార్డుని బద్ధలు కొడతారు. అంతే కాదు ఏపీలో వైసీపీ వ్యతిరేక వాతావరణాన్ని కూడా ఆయన రెడీ చేసి పెడతారు అని ఆలోచిస్తున్నారు. దాంతో పాదయాత్ర మొదలెట్టి కొంత నడిచాక ఆపేసేలా ఎన్నికలను ముందస్తుగా ప్రకటిస్తారు అని అంటున్నారు.
అదే విధంగా పవన్ కళ్యాణ్ వారాహి వాహనం కూడా ఏపీలో కలియతిరగకుండా ఉంచాలంటే ముందస్తు ఒక్కటే మార్గమని ఆలోచిస్తున్నారుట. ఇక విపక్షాల మధ్య పొత్తులు సీట్ల పంపకాలు ఒక కొలిక్కి రాలేదు. అందువల్ల ముందస్తు ఎన్నికలు అంటూ వెళ్తే విపక్షాలు ఏకత్రాటి మీదకు వచ్చినా గ్రౌండ్ లెవెల్ లో బలపడకుండా ఎన్నికలకు పోవచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
వీటికి మించి అతి కీలకమైన పాయింట్ ని రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు వెల్లడించారు. అదేంటి అంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం పూర్తిగా తేలకముందే ఎన్నికలకు వెళ్తే ఆనక ఏమి జరిగినా కూడా కాసుకోవచ్చు అన్న కీలకమైన అజెండా ఉంది అంటున్నారు. వివేకానందరెడ్డి హత్యకేసులో పలువురి వైసీపీ నేతలు పేర్లు వినిపిస్తూండడంతో ఈ విధంగా ముందస్తుకు తొందర పడుతున్నారని అంటున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చిలో నిర్వహించి అవి ముగిసిన తరువాత అసెంబ్లీ రద్దు చేస్తూ జగన్ బటన్ నొక్కుతారని రెబెల్ ఎంపీ జోస్యం చెబుతున్నారు. ఊహాగానాలు కూడా అలాగే ఉన్నాయి. రాజకీయ ప్రచారం కూడా అదే స్థాయిలో ఉంది. ఇక తెలంగాణా సీఎం విషయానికి వస్తే కేసీయార్ సైతం ముందస్తుకు వెళ్తారని అంటున్నారు. ఫిబ్రవరి 17న ఆయన పుట్టిన రోజు వేళ కొత్త సచివాలయాన్ని ప్రారంభిస్తారు అని అంటున్నారు.
ఆ తరువాత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలోనే నిర్వహించి అదే నెలలో అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీయార్ కూడా బటన్ నొక్కేస్తారుట. మొత్తానికి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే సమయంలో ఎన్నికలు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ వాస్తవం ఉందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.