Begin typing your search above and press return to search.

కేసీయార్ జాతీయ మంత్రాంగం..ఆయనకు పోటీగా...?

By:  Tupaki Desk   |   3 May 2023 7:32 PM GMT
కేసీయార్ జాతీయ మంత్రాంగం..ఆయనకు పోటీగా...?
X
గులాబీ బాస్ జాతీయ ప్రెసిడెంట్ హోదాలో ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల పాటు కేసీయార్ ఢిల్లీలో గడుపుతారు అని తెలుస్తోంది. ఢిల్లీలో ఆయన ఏం చేయబోతున్నారు అన్నదే చర్చగా ఉంది. కేసీయార్ కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక కూటమిని కట్టాలని చూస్తున్నారు. ఆ దిశగానే ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఆయన 2019 నుంచి జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

గత ఏడాదిగా ఆయన తన దూకుడును పెంచారు. దేశంలోని విపక్ష నేతలను వరసబెట్టి కలసి వచ్చారు. గతంలో ఆయనను కలిసిన వారిలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ డిప్యూటీ సీఈం తేజస్వి యాదవ్ కర్నాటక నుంచి మాజీ సీఎం కుమారస్వామి వంటి వారు ఉన్నారు.

అయితే కేసీయార్ విపక్షాలను ఏకత్రాటి మీదకు తెచ్చి జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ అన్నవి లేకుండా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నారు. అక్కడే ఆయనకు విపక్ష నేతలతో విభేదాలు వస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ లేకుండా విపక్ష కూటమి తయారు కాదని ఇతర నాయకులు భావిస్తున్నారు.

ఇక విపక్ష పార్టీలు ఏదో ఒక సందర్భంగాలో కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వడమో మద్దతు తీసుకోవడమో చేస్తూ వచ్చాయి. నిన్నటి దాకా చూసుకుంటే కుమారస్వామి బీయారెస్ తో కలసి మెలసి ఉండేవారు. ఆయన ఇపుడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. రేపటి రోజున తన పార్టీ జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించాలని ఆశిస్తున్నారు. అంటే కుదిరితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లతో కలసి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కావాలని చూస్తున్నారు.

దాంతో బీయారెస్ తో జేడీఎస్ దూరంగా ఉంటోంది అని అంటున్నారు. బీహార్ నుంచి జేడీయూ నేత తేజస్వి యాదవ్ కూడా ఇపుడు నితీష్ కుమార్ తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వాన విపక్ష కూటమి కోసం కాళ్లగిరేలా తిరుగుతున్నారు. ఒక విధంగా కేసీయార్ పాత్రలోకి ఆయన లేట్ గా అయినా లేటెస్ట్ గా వచ్చేశారు అన్న మాట.

ఇక నితీష్ కుమార్ ఇప్పటికే మమతా బెనర్జీతోనూ అరవింద్ కేజ్రీవాల్ తోనూ భేటీ అయి యాంటీ బీజేపీ ఫ్రంట్ దిశగా చర్చలు జరిపివచ్చారు. ఇవి ఫలించే విధంగా ఉన్నాయని అంటున్నారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా ఇతర నేతలతో కూడా నితీష్ భేటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో కేసీయార్ హస్తిన టూర్ ఆసక్తిని పెంచుతోంది.

కేసీయార్ ఢిల్లీలో మూడు రోజులు ఉండడం ద్వారా బీయారెస్ ని జాతీయ స్థాయిలో కీలకం చేయాలని చూస్తునారు. మరి ఆయనతో కలసి వచ్చే పార్టీలు ఏవి అన్నది చర్చగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అయితే కాంగ్రెస్ బీజేపీ రెండింటినీ వ్యతిరేకిస్తున్నారు. అలనటి వారితో కేసీయార్ చర్చించే అవకాశం ఉంది.

ఇంకో వైపు మహారాష్ట్ర రాజకీయాల్లో బీయారెస్ ని యాక్టివ్ చేయాలని కూడా కేసీయార్ చూస్తున్నారు. నిజానికి జాతీయ స్థాయిలో రాజకీయ శూన్యత విపక్ష శిబిరంలో అయితే ఉంది. దాన్ని భర్తీ చేసేందుకు సీనియర్ లీడర్లు ఎవరి మటుకు వారు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వారు తామే లీడ్ చేయాలని ఉబలాటపడడం వల్లనే చిక్కులు వస్తున్నాయి.

ఇపుడు కేసీయార్ అయినా నితీష్ కుమార్ అయినా కేంద్రంలో కొత్త ప్రభుత్వంలో కీలకంగా ఉండాలనే చూస్తున్నారు. అదే సమయంలో నితీష్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే కాంగ్రెస్ తో కలసిపోవడం, కేసీయార్ ఈ డిసెంబర్ లో తెలంగాణాలో ఎన్నికల తరువాత కాంగ్రెస్ ని కలుపుకుంటారా అపుడు కూడా దూరం పాటిస్తారా అన్న దాన్ని బట్టే ఆయన జాతీయ రాజకీయ మంత్రాంగం ఏంటి అన్నది ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.