Begin typing your search above and press return to search.
తొలిసారి ముఖాముఖిన తలపడనున్న కేసీఆర్.. జగన్
By: Tupaki Desk | 6 Oct 2020 6:00 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య హాట్ హాట్ చర్చకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదిక కానుంది. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యన ఉన్న స్నేహబంధం తాజా సమావేశంలో ఏమవతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం తలొగ్గే రకం కాదు. కాకుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంటే.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూల్ ఇమేజ్ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా వ్యవహరించే నేర్పు జగన్ సొంతమని చెబుతారు.
జల వివాదాల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన ఆగ్రహాన్ని.. ఆవేశాన్ని జగన్ ప్రదర్శించరు. కూల్ గా తాను చేయాల్సింది చేసుకుంటూ పోతారు. మరి.. ఈ వైఖరిని సీఎం కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ప్రశ్న. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల్ని తేల్చేందుకు సమావేశమవుతున్న అపెక్స్ కౌన్సిల్ వేదికలో ఉన్నతాధికారులు మాత్రమే ఉంటే ఈ వ్యవహారం మరోలా ఉండేది.
అందుకు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా భేటీ కావటంతో.. ఇద్దరి తీరు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి. గడిచిన ఐదారురోజులుగా వరుసగా తన వాదనను వినిపిస్తూ అపెక్స్ కౌన్సిల్ వేళ ఏపీ తీరును కడిగేస్తామన్నట్లుగా సంకేతాలు ఇచ్చిన కేసీఆర్.. అందుకు తగ్గట్లే చెలరేగిపోతే.. ఏపీ సీఎం జగన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న.
సాగునీటి అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న పట్టు అంతా ఇంతా కాదన్నది తెలిసిందే. అయితే.. చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏమంటే.. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవగాహన చాలా ఉందని చెబుతారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఈ అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారని చెబుతారు.
అంతేకాదు.. తన మీద కేసులు బనాయించి చంచలగూడ జైల్లో ఉన్నప్పుడు.. జల వివాదాలకు సంబంధించిన వివరాల్ని పుస్తకాలకు పుస్తకాలు తెప్పించుకోవటమే కాదు.. భారీ ఎత్తున అధ్యయనం చేసినట్లుగా చెబుతారు. ఇరిగేషన్ అంశాల్లో చంద్రబాబు కంటే మిన్నగా జగన్ కే అవగాహన ఎక్కువన్న మాట సీనియర్ అధికారుల నోటి మాటల్లో అప్పుడప్పుడు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీ ఆర్డనరీగా జరిగే అవకాశం లేదని చెప్పక తప్పదు. జగన్ కున్న ఇరిగేషన్ పట్టుఅంశం ఇప్పటివరకు పెద్దగా ఫోకస్ కాలేదు. తాజా భేటీతో ఆ విషయం చర్చకు వచ్చే వీలుందని చెప్పక తప్పదు.