Begin typing your search above and press return to search.
జగన్ - కేసీఆర్..అనుసంధానం ఆపాల్సిందేనా?
By: Tupaki Desk | 26 Aug 2019 5:45 AM GMTఇన్నాళ్లు కృష్ణా నది వట్టిపోయింది. ఎగువన మహారాష్ట్ర - కర్ణాటక భారీ ప్రాజెక్టులు కట్టడంతో కిందకు చుక్క వచ్చేది కాదు.. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అంతా ఎడారిగా ఉండేది.. ఇక గోదారి ఉప్పొంగేది..ఉరుకులు పరుగులు తీసేది. భద్రాద్రి రామన్న పాదాల చెంతగా ఉగ్రరూపంతో ప్రవహించేంది.కానీ ఇప్పుడు వాటర్ రివర్స్ అయ్యింది. కాలం మార్చిన కథలో గోదావరి - కృష్ణలు ఇప్పుడు తారుమారు అయ్యాయి.
ఈ వానాకాలంలో కృష్ణ నది ఉప్పొంగింది. ఎగువన మహారాష్ట్ర - కర్ణాటకలో భారీ వర్షాలకు కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టులు - బ్యారేజీలు అన్ని నిండి చిట్టచివరన ఉన్న పులిచింతల కూడా గేట్లు ఎత్తి విడిచే పరిస్థితి వచ్చింది. దాదాపు కృష్ణా నదిపై ఈసారి 900 టీఎంసీల నీళ్లను అధికారులు వృథాగా సముద్రం పాలు చేశారు. కృష్ణా నది పరివాహకంలో భారీ వర్షాలతో ఈ భారీ నీటిని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నింటిని నింపాకనే ఈ వృథా నీరును వాడుకోలేని స్థితిలో వదిలేశారు. వీటిని గనుక గోదారికో - రాయలసీమకో తరలిస్తే మన చేళ్లు పచ్చబడేవి..
ఇక గోదారి సంగతికి వస్తాం.. మహారాష్ట్ర - కర్ణాటకలో వానలు పడ్డా గోదావరి అంతగా పారలేదు. గోదావరిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీ నిండలేదు. 90 టీఎంసీలకు కేవలం 17 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గోదావరిలో కలిసే మంజీరాలో చుక్క నీరు లేక నిజాంసాగర్ లో చుక్క నీరు లేదు. సింగూరు వట్టిపోయింది. ఒక్క గోదావరిలో కలిసే ప్రాణహిత ఉపనది నీటివల్లే కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బ్యారేజ్ లు - ఎల్లంపల్లి నిండింది. ఇక భద్రాచలం వద్ద ఎగువన చత్తీస్ ఘడ్ లో కురిసిన వర్షాలతో ఉపనదులు పొంగి పోలవరాన్ని ముంచెత్తి సముద్రం పాలు అయ్యాయి.
అయితే గోదావరి ప్రధాన నదికి ఈసారి వరదలు రాలేదు.. ప్రాజెక్టులు నిండలేదు. ఎగువన వర్షాభావమే కారణం. మహారాష్ట్రలో అంతటా వానలు పడ్డా.. గోదావరి పరివాహకంలో పడలేదు. నాండేడ్ - నాసిక్ చుట్టుపక్కల భారీ వానలు పడక శ్రీరాంసాగర్ నిండలేదు. ఉన్న నీటిని మహారాష్ట్ర వాసులే ఒడిసిపట్టేశారు. ఇలా గోదావరి నీటిని కృష్ణ నదికి తరలించి ఆయకట్టు స్థిరీకరిస్తామన్న సీఎంలు కేసీఆర్ - జగన్ లు ఇప్పుడు పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగువన గోదావరిపై మహారాష్ట్ర ప్రాజెక్టులు ఇబ్బడి ముబ్బడిగా కట్టడం.. క్యాచ్ మెంట్ ఏరియాలో వానలు పడకపోవడంతో గోదావరిని నమ్మి ప్రాజెక్టులు కట్టడం - కృష్ణానదికి నీటి మళ్లింపు చేస్తే వృథా ప్రయాస లేక ప్రయోజనమా అన్నది ఆలోచించాలి.