Begin typing your search above and press return to search.
కేసీఆర్.. జగన్ మధ్య ఆరు గంటల సుదీర్ఘ భేటీ
By: Tupaki Desk | 14 Jan 2020 5:44 AM GMTఅంచనాలు తప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రుల భేటీ ఏకంగా ఆరు గంటల పాటు సాగటం ఒక రికార్డుగా చెప్పాలి. తాను కలుసుకున్న వారితో సుదీర్ఘంగా మాట్లాడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. దీనికి తోడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి మిత్రుడ్ని కాస్త గ్యాప్ తర్వాత కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సిన ముచ్చట్లు ఎన్ని ఉంటాయి చెప్పండి? అందుకే కాబోలు.. ఏకంగా ఆరు గంటల పాటు వారి భేటీ సాగినట్లుంది.
భోజనాలు పూర్తి అయ్యాక ఇరువురు ముఖ్యమంత్రులు ఒక చోట కాసేపు కూర్చున్న తర్వాత.. వారిద్దరు వన్ టు వన్ అన్నట్లుగా ఒక రూంలో వీరి భేటీ సాగింది. కేవలం ఈ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మాట్లాడుకున్నట్లుగా సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏం జరిగిందన్న దానిపైనా ఎవరికి ఎలాంటి క్లారిటీ లేనప్పటికీ.. వారు విడుదల చేసిన అప్రకటిత ప్రెస్ నోట్ తో పేర్కొన్న అంశాల్ని ఎవరికి వారు.. వారికి తోచిన రీతిలో రాసుకున్నారని చెప్పాలి.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేసీఆర్.. జగన్ లు కాస్త భిన్నధ్రువాలు. ఎందుకంటే.. మీటింగ్ ఏదైనా.. ఎవరితోనైనా ఒక షెడ్యూల్ అన్నది ఉండదు. అందునా.. తన ఇంటికి భోజనం చేయటానికి వచ్చిన వారికి కేసీఆర్ రోజంతా కూడా కేటాయిస్తుంటారు. అందుకే.. అధికారులతో రివ్యూ కావొచ్చు. ఇంకేదైనా భేటీ అయినప్పటికీ గంటల తరబడి సమావేశం సాగుతూనే ఉంటుంది. దీనికి భిన్నమైన ధోరణిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తుంటారు.
ఏ శాఖకు చెందిన అధికారి అయినా.. అత్యుత్తమ అధికారి అయినా వారికి తాను కేటాయించిన సమయం లోపునే సంభాషణను పూర్తి చేయటం జగన్ కు అలవాటు. ఇందుకు భిన్నంగా తాజా భేటీ ఉండటం.. అది కాస్తా ఏకంగా ఆరు గంటల పాటు సాగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.