Begin typing your search above and press return to search.

కేసీఆరే కాదు...ప్ర‌భుత్వం కూడా తిరుమ‌లకే!

By:  Tupaki Desk   |   23 Feb 2017 5:40 AM GMT
కేసీఆరే కాదు...ప్ర‌భుత్వం కూడా తిరుమ‌లకే!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరుమ‌ల ప‌ర్య‌ట‌న తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట్టంగా మారిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి త‌న చిర‌కాల ఆకాంక్ష నెర‌వేరిర‌న సంద‌ర్భంగా భ‌గ‌వంతుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ విష‌యంలో ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వినిపించాయి. ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం అని కొంద‌రు, శ్రీ కృష్ణ‌దేవ‌రాయుల అంత‌టి కీర్తిని కేసీఆర్ ద‌క్కించుకున్నార‌ని ఇంకొక‌రు. ఈ చ‌ర్చ‌లు ప‌క్క‌న‌పెడితే...కేసీఆర్ తిరుమ‌ల టూర్ సంద‌ర్భంగా ఆయ‌న ఒక్క‌డే కాకుండా మొత్తం ప్ర‌భుత్వం త‌ర‌లివెళ్లిందా అనే భావ‌న ప‌లువురిలో క‌నిపిస్తోంది.

పై ఫొటోను చూడండి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీశ్ రావు స‌హా రాష్ట్ర ఆర్థిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్‌ - వ్య‌వసాయ శాఖా మంత్రి పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి - ఎక్సైజ్ మంత్రి ప‌ద్మారావు గౌడ్‌ - అసెంబ్లీ స్పీక‌ర్ మ‌ధుసూధ‌నా చారి - ఎంపీ సీతారాం నాయ‌క్‌ - ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి - ముఖ్య‌మంత్రి కార్యాల‌య అధికారులు ఫొటోలో లేని మ‌రెందరో కేసీఆర్ వెంట‌వెళ్లారు. ఇలా భారీ స్థాయిలో తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధులు వెళ్ల‌డంతో ప్ర‌భుత్వ‌మే తిరుమ‌ల త‌ర‌లివెళ్లిందా అనే భావ‌న క‌లిగించే రీతిలో కేసీఆర్ తిరుమ‌ల టూర్ జ‌రిగింది. ఇలా మంది మార్బ‌లంతో వెంట వెళ్లారు కాబ‌ట్టే... రెండు ప్ర‌త్యేక విమానాల‌ను ఉప‌యోగించుకోవాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ టూర్ కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింద‌నేది మాత్రం కాద‌నలేని నిజం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/