Begin typing your search above and press return to search.
క్లాస్ నుంచి మాస్‌కి.. మాస్ నుంచి ఊర మాస్‌కి
By: Tupaki Desk | 9 Jun 2015 4:35 AM GMTతన సుదీర్ఘ రాజకీయాల్లో కాస్త క్లాస్‌గా మాట్లాడటం.. ఆ మాటకు వస్తే ఆకర్షించేలా మాట్లాడలేకపోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరహా. దానికి పూర్తి భిన్నంగా తన మాటలతో మనిషిని భావోద్వేగంతో ఊగిపోయేలా చేయటం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు.
అలాంటి ఇద్దరు మహానేతల మధ్య అధిపత్య పోరు షురూ అయి.. ఒకరిని ఒకరు దెబ్బ తీసుకోవటానికి సిద్ధం అయిపోవటంతో రెండు రాష్ట్రాల్లోని రాజకీయం వేడెక్కింది. తీవ్రస్థాయికి చేరుకుంది.
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటికే ఆకర్షించటమే కాదు.. అధికారికంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్న తలసానికి మంత్రి పదవి ఇచ్చి కేసీఆర్ గేమ్ షురూ చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి ఉండకూడదన్న లక్ష్యంగా కేసీఆర్ పావులు కదపటం తెలిసిందే.
చంద్రబాబు కానీ విపక్షంలో ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ.. ఆయన కూడా ఏపీలో అధికారపక్షమే కావటంతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు విసురుతున్న సవాళ్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేన్ని గుంజుకుపోతున్న తీరుతో ఆయన మనస్తాపం చెందారు. ఒకవేళ చంద్రబాబు చేతిలో అధికారం లేకపోతే.. కేసీఆర్ చేసే ఆపరేషన్ ఆకర్ష్‌కు కుమిలిపోయేవారు. కానీ.. చేతిలో పవర్ ఉండటంతో కేసీఆర్‌కు ఒక గుణపాఠం నేర్పాలని అనుకున్నారు.
అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షానికి షాక్ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. ఇలాంటి సందర్భాల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏమాత్రం పనికి రాదు. కానీ.. ఏపీ అధికారపక్షం అందుకు భిన్నంగా వ్యవహరించి అడ్డంగా బుక్ అయ్యింది. ఇలాంటి తప్పుల కోసమే వెయ్యి కళ్లు వేసుకొని చూస్తున్న కేసీఆర్‌కు బాబు అండ్ కో దొరికిపోయింది.
ఇది అందరికి తెలిసిన నగ్న సత్యాలు. ఇక్కడ ఎవరూ సత్య సంథులు లేరు. మరెవరూ సత్యహరిశ్చంద్ర తమ్ముళ్లు కాదు. ఇద్దరు చంద్రుళ్లు ఫక్తు రాజకీయ నేతలు. వారికి వారి రాజకీయ ప్రయోజనాలు తప్పించి.. విలువలు.. సిద్ధాంతాలు లాంటివి అస్సలు అక్కర్లేదు. ఇలా దిగజారిన రాజకీయాల్ని నడిపించే వారి మధ్య మొదలైన అధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది.
వీడియో.. ఆడియో టేపులతో ఏపీ అధికారపక్షం ఆత్మరక్షణలో పడితే.. తాము పన్నిన ఉచ్చులో తాము సైతం ఊహించనంత అమాయకంగా వచ్చి చిక్కుకోవటంతో తెలంగాణ అధికారపక్షం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీంతో.. తనను దెబ్బ తీయటాన్ని ఓర్చుకోలేని చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. తన వైఖరికి భిన్నంగా క్లాస్ నుంచి మాస్ అవతారం ఎత్తి తిట్టేస్తే.. మామూలుగానే మాస్ మాటలు చెప్పే కేసీఆర్‌కు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎక్కడో మండేలా చేశాయి. దొరికిపోయి.. దర్జాగా మాట్లాడటం.. తనను తప్పు పట్టటం.. తన హైదరాబాద్‌లో కూర్చొని తన కిందే చంద్రబాబు మంట పెడతారా? అన్న ఆగ్రహంతో ఉన్న కేసీఆర్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మామూలుగానే మాస్ మాటలతో అలరించే ఆయన ఊరమాస్ మాటలతో ఈ వ్యవహారాన్ని మరో రేంజ్‌కి తీసుకెళ్లారు. మొత్తానికి తమ స్థాయిని మర్చిపోయి మరీ ఇద్దరు చంద్రుళ్లు.. వ్యక్తిగత స్థాయికి కొట్టుకునే పరిస్థితికి వెళ్లిపోయినట్లుగా తాజాగా ఇరువురి మాటలు చూస్తే అర్థం కావటం ఖాయం.