Begin typing your search above and press return to search.
టైం బాగున్నట్లు లేదు.. భారీ యాగానికి ప్లాన్ చేస్తే పోలా సారూ?
By: Tupaki Desk | 10 Dec 2020 4:12 AM GMTనిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ పక్షంగా టీఆర్ఎస్ కు తిరుగులేదు. చివరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు దరిదాపుల్లోకి వచ్చే అధినేతే కనిపించని పరిస్థితి. అలాంటిది దుబ్బాక ఉప ఎన్నిక ఎంతలో ఎంతలా రాజకీయ మార్పులకు కారణమైందన్నది మర్చిపోకూడదు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన చిన్న పొరపాటు.. అది సరిపోదన్నట్లు పెద్ద సారు ఇగోతో నియోజకవర్గానికి వెళ్లేందుకు మక్కువ ప్రదర్శించకపోవటంతో జరిగిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. చివరకు ఓటమి సైతం వెతుక్కుంటూ వచ్చేసింది.
దుబ్బాక ఉప ఎన్నిక ఏదో పొరపాటుగా బీజేపీ గెలిచిందే తప్పించి.. ఆ పార్టీకి అంత సీన్ లేదన్నట్లుగా వ్యవహరించిన అధికార పక్షానికి హైదరాబాద్ మహానగర ప్రజులు కర్ర కాల్చి వాత పెట్టిన చందంతో గులాబీ కారు స్పీడ్ బాగా తగ్గిపోయింది. అదే సమయంలో.. వైరల్ గా అవుతున్న వీడియోలు పెద్ద సారు వద్దకు వెళ్లాయని చెబుతున్నారు. ఇవి సరిపోవన్నట్లుగా ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కొన్ని కేసీఆర్ సర్కారుకు చిరాకును తెప్పించేస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఆర్ఎస్ నేతలు కొందరు అనుసరిస్తున్న తీరు విమర్శలే కాదు.. ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకొస్తోంది.
భారత్ బంద్ సందర్భంగా సామాన్యుడి విషయంలో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉదంతం ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ తెచ్చిందో తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా బంద్ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చెలరేగిపోవటం.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించినట్లుగా విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్ లో చోటు చేసుకున్న కొన్ని ఘటన్లో పోలీసుల తీరు మీదా.. విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం అయ్యేసరికి ఒక లోకల్ జర్నలిస్టును పటాన్ చెర్వు ఎమ్మెల్యే దారుణమైన రీతిలో బెదిరించిన వైనం ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేసింది.
ఇలా ప్రతికూల పరిణామాలన్ని కట్టకొచ్చి మీద పడినట్లుగా.. ఒక్కసారిగా చోటు చేసుకోవటం ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూస్తున్నప్పుడు.. పెద్ద సారు అర్జెంట్ గా ఏదైనా యాగం చేసి.. అంతకంతకూ తరిగిపోతున్న ఇమేజ్ ను పెంచేలా చేయాలని కోరుకుంటున్నారు. టైం బాగోలేకపోవటం కాకుంటే.. ఇలా ప్రతిది ఒక ఇష్యూగా మారటం దేనికి నిదర్శనం? దీన్నేమంటారు?ఎందుకైనా మంచిది.. ఏదైనా భారీ యాగం ఒకటి ప్లాన్ చేయకూడదు సారూ?