Begin typing your search above and press return to search.

జగన్ కు కేసీఆర్ సలహాలు!

By:  Tupaki Desk   |   22 Nov 2021 3:30 AM GMT
జగన్ కు కేసీఆర్ సలహాలు!
X
చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ఒకే వేదికపై కలుసుకున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కోల్డ్ వార్ నడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సీఎం కలుసుకోవడం.. పైగా ఒకే దగ్గర ఇద్దరు కూర్చోవడం.. ఎవరికీ వినపడకుండా రహస్యంగా మాట్లాడుకున్నారు. ఒకవైపు ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో కేసీఆర్, జగన్ ఇద్దరు సఖ్యతగా మెలగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలు స్నిగ్దారెడ్డి వివాహం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ కోత్వాల్‌గూడలోని వీఎన్ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. జగన్ వద్ద ప్రత్యేకాధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడైన రోహిత్ రెడ్డితో స్నిగ్ధారెడ్డి మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ వేడుకకు కేసీఆర్, జగన్ తో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు హజరయ్యారు. ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. చాలా దగ్గరగా కూర్చుకుని ముచ్చటించుకున్నారు. ఇంత క్లోజ్ గా ఉన్న ఈ ఇద్దరు రెండు రాష్ట్రాల మధ్య పెడింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎందుకు చొరవ చూపలేదనే విమర్శలు వస్తున్నాయి.

గతంలో కేసీఆర్, జగన్ మధ్య సఖ్యత ఉండేది. కొంత కాలంగా ఎడముఖం పెడ ముఖంగా ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల జగడం పై రెండు రాష్ట్రాల మంత్రులు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. ప్రాజెక్టుల విషయం లో రెండు రాష్ట్రాల మంత్రులు ఇప్పటికీ గొడవ పడుతున్నారు. నీటి పంపకాలల్లో ఒకరిపై ఒకరు ఫిర్యాలు కూడా చేసుకున్నారు. జగన్ పై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్నినాని దీటుగా సమాధానం కూడా చెప్పారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. అయితే అనుకోకుండా కేసీఆర్, జగన్ ను పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం దగ్గరకు చేర్చింది. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ఇంకా సన్నిహిత సంబంధాలున్నట్లు అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లో సమస్యలను ఇద్దరూ కూర్చొని పరిషర్కించే అవకాశం ఉన్న రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య ఆజ్యం పోస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

మరో వైపు ఇద్దరు సీఎంల భేటీ పై మరో చర్చ జరుగినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ పరిణామాలు... ఆ తర్వాత మీడియా సమావేశం లో చంద్రబాబు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయనకు రాజకీయ, సినీ వర్గాలు సానుభూతి ప్రకటించారు. చంద్రబాబు కు వస్తున్న సానుభూతి తో వైసీపీ ఆత్మ రక్షణ లో పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భం లోనే కేసీఆర్, జగన్ వివాహం లో కలుసు కోవడం.. ఏకాంతంగా మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. గతం లో చంద్రబాబు ను కేసీఆర్ సమర్ధవంతం గా ఎదుర్కున్నారు. అందు వల్ల జగన్, కేసీఆర్ ను కలిశారని, చంద్రబాబును ఎలా కంట్రోల్ చేయాలి? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి.. అనే దాని పై కేసీఆర్ నుంచి జగన్ పలు సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది.