Begin typing your search above and press return to search.
ఏపీతో జల పంచాయితీలపై కేంద్రానికి కేసీఆర్ 14 పేజీల లేఖ
By: Tupaki Desk | 3 Oct 2020 5:15 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరం పెంచారు. ఈ నెల ఆరో తేదీన అపెక్స్ కమిటీ సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వాదనను బలంగా వినిపించాలని.. తెలంగాణ రైతుల పక్షాన పోరాడేందుకు దేవుడితోనైనా కోట్లాడతానని సంచలన వ్యాఖ్యలు చేసిన వైనం తెలిసిందే. తాజాగా ఆయన భారీ కసరత్తును చేపట్టారు. పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ సర్కారు చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరిన కేసీఆర్.. తన వాదనను వినిపించేందుకు వీలుగా భారీ కసరత్తు చేపట్టారు.
దాదాపు 48 గంటల పాటు శ్రమించి 14 పేజీల లేఖను అధికారులకు డిక్టేట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో ఏపీతో ఉన్న జలవివాదాల గురించి సమగ్రంగా ప్రస్తావించినట్లుగా చెబుతున్నారు. కృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఏపీ అనుసరిస్తున్న తీరును.. ఏడేళ్లుగా కేంద్రం వ్యవహరిస్తున్న పద్దతిని కేసీఆర్ తీవ్రంగా తప్పు పట్టారు. తెలంగాణ ప్రజల మనోభావాలు అద్దం పట్టేలా రాసిన ఈ లేఖను కేంద్రానికి సంధించారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు అవుతున్నా.. ఇప్పటికి న్యాయంగా తమకు దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి పొందలేకపోతున్నట్లుగా ఆరోపించారు. కేంద్రం వైఖరి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల పంపిణీని మరింత సులువు చేయాల్సింది పోయి.. వివాదాలకు తెర తీసేలా ఉందని మండిపడ్డారు. ప్రధాని మోడీతో వ్యక్తిగతంగా భేటీ అయిన సందర్భంగా పలుమార్లు జలవివాదాల గురించి ప్రస్తావించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
తెలంగాణలోని 14 ప్రాజెక్టుల నిర్మాణానికి ఉమ్మడి ఏపీ.. మహారాష్ట్ర మధ్య ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు మహారాష్ట్ర.. ఏపీ ముఖ్యమంత్రులు.. ఏపీ తెలంగాణ గవర్నర్ తన పక్కనే ఉన్నారని.. ఇప్పటికి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పని 95 వాతం పూర్తి అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి చేసిన కంప్లైంట్లు.. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా ఆ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై దృష్టి పడకుండా చేసే ప్రయత్నంగా కేసీఆర్ పేర్కొన్నారు. నదీ జలాల పంపిణీలో తెలంగాణకు ఇంకా జరగని న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి తానీ లేఖ రాసినట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడీ లేఖ వాతావరణాన్ని వేడెక్కించేలా ఉండటం గమనార్హం.