Begin typing your search above and press return to search.
100 రోజుల్లోపు 70లక్షల రీరిజిష్ట్రేషన్లా?
By: Tupaki Desk | 17 Oct 2015 7:03 AM GMTవెనుకా ముందు చూసుకోకుండా నిర్ణయాలు తీసేసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఎవరైనా అన్న విమర్శకు తగ్గట్లే తాజాగా తీసుకున్న నిర్ణయం తెలంగాణవ్యాఫ్తంగా సెగలు పుడుతోంది. పెద్దఎత్తున ప్రభావం చూపించే వాహనాల రిజిస్ట్రేషన్ విషయం మీద తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రాక్టికల్ గా చూస్తే అదెలాంటిదో ఇట్టే తెలుస్తుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో.. విభజనకు ముందు ఏపీ పేరు మీదున్న వాహనాల్ని రీరిజిష్ట్రేషన్ చేయాలని.. ఇందుకు నాలుగు నెలల గడువు ఇస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అసాధ్యమైన ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైపైన ఉండే లెక్కల్ని తీసుకుంటూ..తాజా ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన వాహనాలు దాదాపు 70లక్షల వరకు ఉంటాయి. వీటిల్లో 44 లక్షల వాహనాలు ఒక్క గ్రేటర్ పరిధిలోనూ.. శివారుల్లోని కొన్ని పంచాయితీల్లో ఉంటాయి.
ఇక.. ప్రభుత్వం ఇచ్చిన గడువును చూస్తే.. నాలుగు నెలల సమయం. నెలకు 30 రోజుల చొప్పున (31 లెక్కలోకి తీసుకోకుంటే) నాలుగు నెలలకు 120 రోజులుగా లెక్కలోకి తీసుకుంటే.. మొత్తం 120 రోజులు. వీటిల్లో ప్రతి నెల నాలుగు ఆదివారాలు లెక్కలోకి తీసుకుంటే నాలుగు నెలలకు 16 రోజులు పోతాయి. ఇక.. బతుకమ్మ ముగింపు సందర్భంగా ఒక రోజు సెలవు.. దసరా.. దీపావళి.. క్రిస్ మస్.. సంక్రాంతికి రెండు రోజులు.. జనవరి 26 రిపబ్లిక్ డే రోజును లెక్కలోకి తీసుకుంటే వచ్చే సెలవులు ఆరు ఉంటాయి. ఇవి కాకుండా మధ్యలో ఉండే రెండు ముడింటిని వదిలేస్తే. అంటే.. 120 రోజుల్లో 16 ఆదివారాలు.. ఆరు ఇతర సెలవుల్ని కలిపితే 22 రోజులు. వాటిల్లో రెండు రోజులు వదిలేసినా మొత్తంగా 100 రోజులు ఉంటాయి. అంటే.. రోజుకు 70వేల వాహనాల్ని రాష్ట్ర వ్యాప్తంగా రీరిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో రోజూ 70వేల మంది ప్రజలు ఒక్క ఆర్టీవో ఆపీసుల వద్ద బారులు తీరితే పరిస్థితేంటి? రోజూ వచ్చే వెయ్యి లోపు వాహనాలకు రిజిస్ర్టేషన్లు చేయటానికి కిందామీదా పడే అధికారులు.. రోజుకు 70వేల మంది పోటెత్తితే పరిస్థితి ఏంటి?
ఇదొక సమస్య అయితే.. వంద రోజుల్లో రీరిజిస్ట్రేషన్ చేయాల్సినవి 70 లక్షలు.. వీటితో పాటు.. ప్రతి రోజూ వచ్చే వాహనాలు ఉండనే ఉంటాయి. ఇప్పటికే అరకొర ఉన్న రవాణాశాఖలోని సిబ్బందితో ఇంత భారీ ఎత్తున రీరిజిస్ట్రేషన్లను పూర్తి చేయటం సాధ్యమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదన్న విషయాన్ని లెక్కలు తెలిసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. మరి.. అలాంటి అసాధ్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా సుసాధ్యం చేద్దామనుకుంటున్నారు..?