Begin typing your search above and press return to search.
కవిత.. కేటీఆర్ రూట్ ఫాలో కావాలా?
By: Tupaki Desk | 7 Sep 2016 10:30 PM GMTరాజకీయాల్లో ఉన్న వారికి ఏం ఉన్నా లేకున్నా.. తొందరపాటు అస్సలు పనికి రాదు. దూకుడుతనం ఎంత ఉన్నా.. సమయం సందర్భం లేకుండా ప్రతి విషయానికి చెలరేగిపోవటం లాంటి వాటితో లాభం కంటే నష్టమే ఎక్కువ. రాజకీయ నేతల్లో కొందరిపై వారి ప్రత్యర్థులు సైతం తొందరపడి మాట అనేందుకు ఏ మాత్రం ఇష్టపడరు. ఏదైనా మాట అనాల్సి వస్తే ఆచితూచి మాట్లాడతారు. ఈ లక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కనిపిస్తుంది. అందరినీ తప్పు పట్టే ఆయన్ను తిట్టటానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు కాస్త ఆలోచించి మాట అంటారే కానీ తొందరపడి పుసుక్కున మాట అనేందుకు ఇష్టపడరు.
అలాంటి బెరుకును కలిగించే విషయంలో కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆశ్చర్యకరంగా ఈ మధ్యన ఈ విషయంలో కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత తప్పటడుగులు వేయటం కనిపిస్తుంది. తనకు సంబంధం ఉన్నా లేకున్నా కలుగజేసుకొని మరీ మాట అనిపించుకునే తత్వం ఆమెలో ఈ మధ్యన ఎక్కువైందని చెప్పక తప్పదు.
కొత్త జిల్లాల పంచాయితీలో ఆమె తన వాదనను వినిపించటం తప్పేం కాదు. కానీ.. ఆ తొందరలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణపై విరుచుకుపడటం పెద్ద తప్పుగా మారింది. ఆమెను ఉద్దేశించి ‘బొమ్మాళి’ అన్న విమర్శ మిస్ ఫైర్ కావటమే కాదు.. ఇప్పటివరకూ ఎప్పుడూ అనిపించుకోని మాటలన్నీ కవిత అనిపించుకున్నారు. కవిత లాంటి పవర్ ఫుల్ నేతను నాలుగు మాటలు అనే అవకాశం లభించినప్పుడు విపక్షాలు ఏ మాత్రం వదిలిపెట్టవు. అందుకే ఆమెపై విరుచుకుపడేందుకు కాంగ్రెస్ నేతలు ఒకరికి మించిన ఉత్సాహంతో మరొకరు అన్న చందంగా చెలరేగిపోయారు.
కవితపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు చూసిన తర్వాత.. కవిత తొందరపాటుతో డీకే అరుణను విమర్శించిన భావన కలగటం ఖాయం. అంతేకాదు.. ఈ విమర్శల పరంపర తనకు పరిమితం చేసుకోకుండా తన తండ్రి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా తిట్ల దండకం అందుకునే అవకాశాన్ని కల్పించారన్న భావన కలగటం ఖాయం. ఇదొక్కటే కాదు.. తాజాగా ఆమె మరో తప్పు కూడా చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ నేతలపై కస్సుమన్న కవిత.. ఆ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటికి కౌంటర్ అన్న చందంగా బీజేపీ నేతలు ఆమెపై చిరాకు పడిపోయారు.
ఇలా ఒకటి తర్వాత ఒకటిగా.. సున్నితమైన అంశాలపై పెదవి విప్పి కవిత తనపై విమర్శలు కురిసేలా చేసుకోవటంతో పాటు.. తన తండ్రిపై విమర్శలు వర్షం కురిసేలా చేశారనుకోవాలి. మరోవైపు కవిత సోదరుడు రాష్ట్రమంత్రి కేటీఆర్ తీరును నిశితంగా గమనిస్తే.. ఆయన తొందరపడి మాట్లాడటం అస్సలు కనిపించదు. ఆ మాటకు వస్తే వివాదాస్పద అంశాల జోలికి అస్సలు వెళ్లరు. కదిలించి తిట్టించుకోవటం కంటే.. అసలు పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తూ వివాదాలకు దూరంగా ఉండటమే కాదు.. నలుగురు తనను మాట అనే అవకాశం కేటీఆర్ ఇవ్వటం కనిపించదు. ఇదంతా చూసినప్పుడు తన సోదరుడిని కవిత ఫాలో కావాల్సిన అవసరం ఉందనిపించక మానదు.