Begin typing your search above and press return to search.

ఈడీకి షాకిచ్చిన కవిత!

By:  Tupaki Desk   |   16 March 2023 12:01 PM GMT
ఈడీకి షాకిచ్చిన కవిత!
X
విచారణకు హాజరవ్వాల్సిన కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు షాకిచ్చారు. 16వ తేదీన విచారణకు హాజరవ్వాల్సుంటుందని ఈడీ ఉన్నతాధికారులు 11వ తేదీన జరిగిన విచారణ సందర్భంగానే నోటీసిచ్చారు. దానికి తగ్గట్లే కవిత కూడా ప్రిపేర్ అయ్యారు. ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్న కవిత గురువారం ఈడీ విచారణకు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఉదయం 11 గంటలకు విచారణ నిమ్మితం కవిత ఈడీ ఆఫీసుకు చేరుకోవాలి.

మొదటిసారి విచారణ సందర్భంగా చేసినట్లే కెసిఆర్ ఇంటిదగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. రెగ్యులర్ పోలీసులు కూడా కెసిఆర్ ఇంటికి చేరుకున్నారు. 10.30 గంటలకు కవిత ఇంటినుండి బయలుదేరుతారని అనుకున్నారు.

కానీ ఎంతసేపటికీ ఇంట్లోనుండి రాలేదు. 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సిన కవిత టైం అయిపోయినా ఎందుకు హాజరుకాలేదో అర్ధంకాలేదు. అయితే 11.40 గంటలకు తేలిందేమంటే విచారణకు కవిత హాజరవ్వాలని అనుకోలేదని.

బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా కవిత రాతమూలకంగా కొన్ని సమాధానాలను ఈడీ అధికారులకు పంపారు. విచారణకు హాజరయ్యే సమయంలోనే కొన్ని డాక్యుమెంట్లను తీసుకురావాలని కోరిన ఈడీ మరికొన్నింటికి సమాదానాలను కూడా ఇవ్వాలని చెప్పారు. అందుకనే వాళ్ళడిగిన ప్రశ్నలకు రాతమూలకంగా సమాధానం ఇచ్చి పంపారు. అనారోగ్య కారణాలతోనే విచారణకు హాజరుకావటం లేదని కవిత చెప్పినట్లు సమాచారం.

విషయం ఏమిటంటే ఉదయం నుండి ఢిల్లీలోని కెసిఆర్ ఇంట్లో న్యాయనిపుణులతో చర్చల మీద చర్చలు జరుపుతున్న కవిత ఈడీ విచారణకు మాత్రం అనారోగ్యం కారణంతో హాజరుకాలేనని సమాధానమివ్వటం. మరి విచారణకు హాజరుకాకుండా సోమాతో సమాధానాలను పంపటం, అనారోగ్యం కారణాలని చూపటాన్ని ఈడీ అంగీకరిస్తుందా ? అనేది అనుమానంగా మారింది.

కవిత గనుక విచారణకు హాజరుకాకపోతే వెంటనే ఈడీ ఇదే విషయాన్ని కోర్టులో చెప్పే అవకాశముంది. విచారణను ఉద్దేశ్యపూర్వకంగానే ఎగ్గొడుతున్న కారణంగా అరెస్టు చేసేందుకు అనుమతి కోరే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ ఈడీ రిక్వెస్టును కోర్టు గనుక ఆమోదిస్తే అప్పుడు కవితకు పెద్ద సమస్యవ్వటం ఖాయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.