Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం..

By:  Tupaki Desk   |   19 Jan 2022 4:00 PM IST
ఎట్టకేలకు ఎమ్మెల్సీగా కవిత ప్రమాణం..
X
నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం శాసనమండలి చైర్మన్ చాంబర్ లో ప్రొటెం చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రీ.. కవిత చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మండలి రూల్స్ బుక్స్, ఐడీ కార్డు అందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

కవితతోపాటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి వారితో తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కవిత, దామోదర్ రెడ్డిలకు మంత్రి మండలిరూల్స్ బుక్స్, ఐడీ అందజేశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.