Begin typing your search above and press return to search.
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత
By: Tupaki Desk | 8 March 2023 10:31 AM GMTఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. లిక్కర్ స్కాంలో తాను చేసింది ఏమీ లేదని.. తాను దేనికీ భయపడబోనని ఆమె స్పష్టం చేశారు. 'ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేను చేసింది ఏం లేదు. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. నేను దేనికీ భయపడను. అరెస్ట్ చేస్తే ప్రజల దగ్గరికి వెళతా..' అంటూ ఆమె తెలిపారు.
అలాగే 'లిక్కర్ నేను ఫోన్లు ధ్వంసం చేయలేదు. అడిగితే ఫోన్లు కూడా ఇస్తా. గతంలో ఈ స్కాంలో సంబంధించి ఆరు గంటల పాటు సీబీఐ అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చా' అని ఆమె వివరించారు.బీజేపీ టార్గెట్ తాను కాదని.. కేసీఆర్ అని కవిత తెలిపారు.జైలుకు పంపిస్తే తానేమీ చేయలేనని.. ఇందులో తన పాత్రేమీ లేదని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని ఈడీ తాజాగా ఆమెను సమన్లు జారీ చేసింది.ఇందుకోసం ఢిల్లీకి రావాలని పేర్కొంది. హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఈ కేసులో రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని ఈడీ మంగళవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపిన విషయం తెలిసిందే.
ఇటీవలే అరుణ్ రామచంద్ర పిళ్లైను కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు అని పిలిచి అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో డిప్యూటీ సీఎం సిసోడియా సైతం అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యారు.
ఇప్పుడు కవితకు సన్నిహితుడైన అరుణ్ పిళ్లై అరెస్ట్ కావడంతో నెక్ట్స్ కవిత అన్న ప్రచారం మీడియాలో జోరుగా సాగింది. తాజాగా విచారణకు కవితను పిలవడంతో ఆమెను అరెస్ట్ చేస్తారా? అన్న ఊహాగానాలు మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.