Begin typing your search above and press return to search.

ఏపీ టీజీ క్రేజీ : జల వివాదాల‌కు క‌వితక్క చెక్ పెట్టేనా?

By:  Tupaki Desk   |   19 Feb 2022 10:39 AM GMT
ఏపీ టీజీ క్రేజీ : జల వివాదాల‌కు క‌వితక్క చెక్ పెట్టేనా?
X
కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్ల‌కు ఒర‌వ‌డి దిద్దేందుకు తానెన్న‌డూ సిద్ధ‌మేన‌ని చెబుతారు కేసీఆర్ కానీ వివాదాల ప‌రిష్కారం పై మాత్రం ఆయ‌న పెద్ద‌గా దృష్టి సారించ‌రు అన్న‌ది సుస్ప‌ష్టం. కృష్ణా, గోదావ‌రి జిల్లాల‌పై ఉన్న ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ సంబంధిత వ్య‌వ‌హారాలు అన్నీ కేంద్రం ప‌రిధిలోకి వెళ్లాక ఇక ఇరు రాష్ట్రాలూ త‌మ ప‌రిధిలో ప‌రిష్క‌రించుకోవాల్సినవి ఏవీ లేవు. అన్ని అధికారాల‌కూ పెద్ద కేంద్ర‌మే!

అయిన‌ప్ప‌టికీ ఇరు రాష్ట్రాలూ కూర్చొని కూలంకుషంగా చ‌ర్చించుకుంటామంటే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని గ‌తంలో సుప్రీం కోర్టు కూడా తేల్చింది.క‌నుక ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ నీళ్ళ పంప‌కం, జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి మ‌రియు వాడకం వీట‌న్నింటిపై మాట్లాడుకోవాల్సినంత మాట్లాడుకుంటేనే మేలు. అందుకు కేసీఆర్ మరియు జ‌గ‌న్ ఓ సామ‌ర‌స్య పూర్వ‌క ధోర‌ణికి అంగీక‌రిస్తే ఇంకా మేలుజ‌.ఈ ద‌శ‌లో రాయ‌సీమ మేధావుల ఫోరం పెద్ద‌లు నిన్న‌టి వేళ తిరుప‌తిలో ఎమ్మెల్సీ క‌విత‌ను క‌లిసి త‌మ గోడు వినిపించారు. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో ....

కృష్ణా జ‌లాల వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు తాను ఎన్న‌డూ సిద్ధ‌మేనని అంటుంటారు కేసీఆర్.ఇదే నేప‌థ్యంలో రెండ్రోజుల పర్య‌ట‌న‌కు వ‌చ్చిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు,శాస‌న మండ‌లి స‌భ్యురాలు క‌విత ను రాయ‌ల సీమ మేధావుల ఫోరం అధ్య‌క్షుడు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి క‌లిశారు. సీమ బాధ‌లు చెప్పారు. జల వివాదాలు ప‌రిష్క‌తం అయితే రాయ‌ల‌సీమ‌తో పాటు ద‌క్షిణ తెలంగాణ జిల్లాలు కూడా స‌స్య‌శ్యామ‌లం అవుతాయ‌ని అన్నారు. చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి (వైసీపీ ఎమ్మెల్యే) నేతృత్వాన మాకిరెడ్డి తో స‌హా ప‌లువురు ఫోరం స‌భ్యులు క‌విత‌ను క‌లిసి త‌మ గోడు వినిపించారు.ఇందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని, జ‌ల వివాదాలు త్వ‌ర‌లోనే ప‌రిష్కృతం అవుతాయ‌ని క‌విత హామీ ఇచ్చారు.ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క‌థారచ‌యిత నామిని సుబ్ర‌హ్మ‌ణ్యం నాయుడు వెలువ‌రించిన మిట్టూరోడి పుస్త‌కం అనే క‌థా సంక‌ల‌నాన్ని ఆమెకు బ‌హూక‌రించారు.

ఇవ‌న్నీ బాగానే ఉన్నా కృష్ణా జ‌లాల పంపిణీ,శ్రీ‌శైలం ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న వివాదాలు,విభేదాలు ఇంత వేగంగా ప‌రిష్కారం అవుతాయా అన్నదే ఓ పెద్ద డైల‌మా? గ‌తంలో కూడా జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తికి సంబంధించి రెండు రాష్ట్రాల మ‌ధ్య ఎడ‌తెగ‌ని వివాదాలు నెల‌కొన్నాయి.

అయితే త‌రువాత అవి ఇరు ప్ర‌భుత్వాల అధికారుల చొర‌వ, అంతేకాకుండా మోతాదు మించి ప్రాజెక్టుల్లో ఇన్ ఫ్లో ఉండ‌డంతో స‌మ‌స్య సులువుగానే ప‌రిష్కారం అయింది. కానీ త‌రువాత కాలంలో మ‌ళ్లీ జ‌ల వివాదాల ఊసే లేదు.తాజాగా సీమ పెద్ద‌ల విన్న‌పాన్ని క‌విత విన్నారు. ఆమెకు కూడా వీటిపై అంతో ఇంతో అవ‌గాహ‌న ఉంది కానీ ప‌రిష్క‌రించేంత శ‌క్తి ఆమెకు ఉంది అని మాత్రం చెప్ప‌లేం.