Begin typing your search above and press return to search.
కవితను ఎవరూ పట్టించుకోవడం లేదట..
By: Tupaki Desk | 29 Nov 2016 6:56 AM GMTప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఆమె కనిపించాల్సిందే. అలాంటి నేత ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏమాత్రం గుర్తింపు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆమె ఎవరో కాదు... సీనియర్ లీడర్ కవిత. ఆశ్చర్యపోవద్దు... ఈమె తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కాదు.. టీడీపీ నేత - సినీనటి కవిత. అవును... టీడీపీ నేత కవితను ఇప్పుడా పార్టీలో ఎవరూ పట్టించుకోవడం లేదట. తనను వాడుకుని కరివేపాకులా పక్కకు తీసి పడేశారని ఆమె ఆవేదన చెందుతున్నారు.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ మీటింగ్ లు జరిగినా కవితను ప్రత్యేకంగా ఆహ్వానించేవారు. సినిమావాళ్లు వస్తేజనం వస్తారన్న ఉద్దేశమే అందుకు కారణం. టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాలమంతా ఆమె చురుగ్గా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు పార్టీ ఆఫీసుకు వెళ్లినా ఆమెను పలకరించేవారే లేరట. ఈ సంగతి ఆమే స్వయంగా చెప్పుకొని బాధపడుతున్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సందర్భంగా కవిత తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. టీడీపీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా చూస్తున్నారని.. అధికారంలోకి రాగానే చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని ఈ పరిస్థితిని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె చెప్పారు.
ఇతర పార్టీలు తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయని… అయినా టీడీపీ మీద అభిమానం - చంద్రబాబుపై నమ్మకంతోనే ఇంకా ఎదురుచూస్తున్నానని చెప్పారామె. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన కుటుంబాన్ని, సంపాదనను వదిలి పార్టీ కోసం శాయశక్తులా కృషి చేశానని, అధికారంలోకి రాగానే తనను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నిజాలు గుర్తించాలన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నానన్నారు కవిత. రాజకీయాల్లో ఎన్నో ఒడుదుడుకులు తట్టుకుని నిలబడ్డానని చెప్పారు. 1982లో పార్టీ సభ్యత్వం తీసుకుని ఎన్టీఆర్ చైతన్యరథం వెంట ప్రచారం కూడా చేశానని గుర్తు చేసుకున్నారు. అలాంటి తనను పార్టీ పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. కాగా.... కవిత ఆవేదన వెనుక పార్టీ మారే ఆలోచన ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/