Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చిన కవితక్క

By:  Tupaki Desk   |   4 April 2016 5:07 AM GMT
కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చిన కవితక్క
X
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రజంటేషన్ కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టటం తెలిసిందే. ముఖ్యమంత్రి ఇచ్చే ప్రజంటేషన్ తప్పుల తడకగా ఆరోపిస్తూ వారు.. ప్రజంటేషన్ కు గైర్హాజరయ్యారు. ప్రజంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రజంటేషన్ కు హాజరు కాకుండా.. కేసీఆర్ చెప్పిన మాటల్ని వినకుండా.. తప్పు పట్టటం ఏమిటన్న సగటుజీవి సందేహానికి టీ కాంగ్రెస్ నేతలు సంతృప్తికర సమాధానం చెప్పటం లేదు.

ఒక మాట ఎవరైనా చెబుతుంటే.. ఆ మాటను పూర్తిగా విన్న తర్వాత.. ఏం చెప్పినా బాగుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తున్న వాదనను వినటం అన్నది పక్కన పెట్టి.. తమ వాదనను బలంగా వినిపిస్తున్న టీ కాంగ్రస్ నేతల వైఖరిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో తమకూ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం కల్పించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాదిస్తున్నారు.

ఈ వితంత వాదం ఇలా సాగుతుంటే.. ఊహించని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఇరిగేషన్ ప్రజంటేషన్ కు తమను ఆహ్వానిస్తే వస్తామని స్పష్టం చేశారు. అయితే.. కేసీఆర్ ప్రజంటేషన్ కు ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రజంటేషన్ కు తమను పిలిస్తే.. తాము ఇంజినీర్లతో సహా హాజరు కానున్నట్లు చెప్పిన ఆమె రియాక్షన్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఊహించని తీరులో ఉందన్న మాట వినిపిస్తోంది. కవితక్క తాజా రియాక్షన్ కు టీ కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.