Begin typing your search above and press return to search.
తన 10 ఫోన్లు మీడియా ముందు పెట్టిన కవిత
By: Tupaki Desk | 21 March 2023 11:46 AM GMTమంగళవారం ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణకు బయలుదేరేముందు కవిత కొన్ని మొబైల్ ఫోన్లను చూపించారు. ఢిల్లీలోని కేసీయార్ ఇంటినుండి బయటకు వచ్చి కారులో ఈడీ ఆఫీసుకు బయలుదేరారు. కారులో కూర్చునే ముందు కవిత రెండుచేతుల్లోను రెండు కవర్లను పట్టుకుని చూపించారు. రెండు చేతుల్లోని కవర్లలో మొబైల్ ఫోన్లున్నాయి. ఆ ఫోన్లు ఎన్ని అనే విషయంపై స్పష్టత లేకపోయినా తొమ్మిది ఫోన్లున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈరోజే కవిత ఎందుకు మొబైల్ ఫోన్లను చూపించారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సూత్రదారిగా ఈడీ అనుమానిస్తున్న విషయం తెలిసిందే. కవితకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈడీ అనేక విషయాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో వివరించింది.
అందులో కవిత 10 ఫోన్లను ధ్వంసం చేశారనే ఆరోపణ కూడా ఒకటి. స్కామ్ లో పాత్రదారులు 36 మంది మొత్తం 170 మొబైల్ ఫోన్లను వాడారని తర్వాత ధ్వంసంచేశారనేది కీలకమైన ఆరోపణ.
మిగిలిన వాళ్ళ సంగతి ఎలాగున్నా కవిత మాత్రం ఈరోజు తానువాడిన మొబైల్ ఫోన్లను మీడియా ద్వారా జనాలందరికీ చూపించారు. ఇక్కడే కవిత ఏమి చెప్పదలచుకున్నారు అన్నది కీలకమైంది. ఈడీ చెబుతున్నట్లుగా తాను పది ఫోన్లను ధ్వంసంచేయలేదని చెప్పదలచుకున్నారా అన్నది అర్ధం కావటంలేదు. ఈడీ ఆరోపిస్తున్నట్లుగా కవిత పది ఫోన్లను ధ్వంసం చేయలేదనే అనుకుందాం. మరి పది ఫోన్లను వాడాల్సిన అవసరం, మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది .
ఎంత బిజీగా ఉండేవారైనా రెండు ఫోన్లు మహాయితే మూడు ఫోన్లు వాడచ్చు. కొంతమంది తరచూ ఫోన్లను మారుస్తుంటారు. అంతేకానీ ఏడాదిన్నర కాలంలో పది ఫోన్లను అయితే వాడరు. కానీ కవిత వాడారని ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఇపుడు కవిత చూపించిన మొబైల్ ఫోన్లు కీలక ఆధారంగా మారింది.
ఈడీ ఆరోపిస్తున్నట్లుగా తాను ధ్వంసంచేయలేదు కానీ పది ఫోన్లను వాడింది నిజమే అని కవిత అంగీకరించినట్లయ్యింది. మరి ఫోన్లలోని డేటా ఏమైంది ? దాన్ని ఈడీ బయటపెడితే కానీ మొత్తం విషయం ప్రపంచానికి తెలీదు. మొబైళ్ళని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ చేస్తుందో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.