Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోరిక‌ను క‌విత‌క్క చెప్పేశారా?

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:18 AM GMT
కేసీఆర్ కోరిక‌ను క‌విత‌క్క చెప్పేశారా?
X
తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌మ్ ఎంపీ క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓప‌క్క త‌న కొడుకు ప‌ట్టాభిషేకానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను కేసీఆర్ చేస్తున్నార‌న్న వాద‌న జోరుగా వినిపిస్తున్న వేళ‌.. ఆయ‌న కుమార్తె క‌విత త‌న తండ్రి మ‌న‌సులోని మాట‌ను చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి.

కేసీఆర్ కు సీఎం ప‌ద‌వి చాలా చిన్న‌ద‌న్న మాట చెప్ప‌టం ద్వారా.. ఇప్పుడు త‌న తండ్రి దృష్టి అంతా ఎక్క‌డ ఉంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో పాటు.. కేసీఆర్ ఫ్యూచ‌ర్ ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయ‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. తాజాగా ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

త‌న తండ్రి క‌మ్ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గొప్ప‌త‌నం గురించి వివ‌రిస్తూ.. ఎవ‌రైనా రాష్ట్రానికి సీఎంగా ఉంటే ఆయ‌న అధికారాలు.. పాల‌న గురించి మాట్లాడుకుంటార‌ని.. కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా త‌న ఆలోచ‌న‌ల‌న్నీ భిన్నంగా ఉంటాయ‌న్నారు. ఆయ‌న రాజ‌కీయాల కోసం కాకుండా భ‌విష్య‌త్తు త‌రాల కోసం త‌పిస్తార‌న్నారు.

కేసీఆర్ గొప్ప వ్య‌క్తి అని.. ఆయ‌న వ్య‌క్తిత్వానికి.. రాజ‌నీతిజ్ఞతకు..మంచిత‌నానికి సీఎం పోస్టు చాలా చిన్న‌దని చెప్పారు.ఆయ‌న రాజ‌కీయాల కోసం కాకుండా భ‌విష్య‌త్తు త‌రాల కోసం త‌పిస్తార‌ని.. సీఎం ప‌ద‌విలో ఉంటేనే సీఎంగా గుర్తు పెట్టుకుంటార‌ని.. కానీ కేసీఆర్‌ ను మాత్రం వందేళ్ల త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు గుర్తు పెట్టుకునే స్థాయిలో ప‌ని చేస్తార‌ని చెప్పుకొచ్చారు. త‌న తండ్రి స్థాయికి సీఎం పోస్టు చిన్న‌ద‌ని క‌విత మాట‌లు విన్నంత‌నే.. అందుకే గ‌డిచిన నాలుగున్న‌రేళ్ల కాలంలో స‌చివాల‌యానికి ప‌ట్టుమ‌ని ప‌దిసార్లు కూడా రాలేదా? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.