Begin typing your search above and press return to search.
విమోచన మీద కవిత మాటల్లో లాజిక్ ఉందా?
By: Tupaki Desk | 4 Sep 2016 1:30 PM GMTపెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే టీఆర్ ఎస్ ఎంపీ కవితకున్న మేథోతనం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. సున్నితమైన అంశాల పట్ల ఆమెకున్న అవగాహన ఏపాటిదన్న విషయం ఇప్పటికే లోక్ సభలో ఆమె మాట్లాడిన అంశాల్ని చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి కవితకు తెలంగాణ విలీనానికి.. విమోచనానికి మధ్య వ్యత్యాసం తెలీదనుకోవటం తప్పే అవుతుంది. నిజాం నియంత పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా సర్దార్ పటేల్ భారత్ లో కలిపేయటాన్ని మర్చిపోకూడదు.
ఈ ఘటన జరిగిన సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా కొందరు పేర్కొంటే.. మరికొందరు తెలంగాణ విమోచన దినోత్సవంగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఈ రెండు పదాల మధ్యనున్న వ్యత్యాసం ఉన్న మాట వాస్తవమే అయినా.. ఇష్యూను చూసే దృక్పదానికి తగ్గట్లుగా ఉంటుందనటంలో సందేహం లేదు. సర్దార్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యింది. ఆ విషయంలో వేరే చర్చకు అస్కారం లేదు. అయితే.. ఈ విలీనాన్ని విమోచనగానే అప్పటి ప్రజలు భావించారు. ఎందుకంటే.. నిజాం పాలనకు విసిగి వేసారిపోయిన హైదరాబాద్ సంస్థాన ప్రజలు భారత్ లో కలిసేందుకు తపించిపోయారు.
భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రజలంతా పండుగ చేసుకునే పరిస్థితి. నాటి పండుగను నేడు ఉత్సవంగా చేసుకోవటానికి అభ్యంతరం ఏమిటన్నది ప్రాధమికమైన ప్రశ్న. ఒక నియంతను నియంతగానే చూడాలే తప్ప.. ఆ నియంతకు మతాన్ని తగిలించి..ఆ మతస్తుల్ని అవమానించటం ఏమిటన్న సందేహం రాక మానదు. ఒక రాక్షసుడైన పాలకుడి నుంచి విముక్తి లభించినప్పుడు మతాలకు అతీతంగా ప్రజలు పండుగ చేసుకునే పరిస్థితి. సదరు రాజు ముస్లిం అయిన నేపథ్యంలో.. ఆ రాజు రాజ్య పతనం ఆ మత ప్రజలకు బాధ కలిగిస్తుందని ఫీలవ్వటానికి మించిన దురదృష్టం ఇంకేం ఉంటుంది.
అంటే.. నిజాం పాలనను ముస్లింలు అంగీకరించినట్లా? నాడు హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ ప్రజలపై సాగించిన దారుణ దమనకాండను ముస్లింలు స్వాగతిస్తారా? మహిళల్ని నగ్నంగా బతుకమ్మ ఆడించటాన్ని ముస్లిం ప్రజలు ఒప్పుకుంటారా? ప్రశ్నలు వేసుకున్నప్పుడు ఎంపీ కవిత లాంటి వారు చెప్పే మాటలకు అర్థం లేదనే చెప్పాలి. నిజాం పాలన నుంచి విముక్తి అయిన సెప్టెంబరు 17ను విముక్తి దినోత్సవంగా జరుపుకోవటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కవిత.
ఇదంతా హిందూ.. ముస్లింలను విడగొట్టి రాజకీయం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లుగా కవిత ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. నియంత పాలనలో తెలంగాణ ప్రజలు పడిన కష్టాల్ని సైతం ముస్లిం ప్రజలు సంతోషించినట్లా? అన్న ప్రశ్నకు కవిత ఏం సమాధానం చెబుతున్నారు. నిజాంపై సైనిక చర్యను ఉత్సవంగా చేసుకుంటే హిందూ.. ముస్లింలు విడిపోతారన్నదే నిజం అయితే.. నిజాంపై జరిగిన సైనిక చర్యను ముస్లింలు వ్యతిరేకిస్తున్నట్లుగా కవిత చెప్పదలుచుకున్నారా? అన్నసందేహం కలగక మానదు. అన్నీ తెలిసిన కవితకు విమోచన విషయానికి వచ్చేసరికి సరికొత్తగా కనిపించటం ఏమిటి చెప్మా..?