Begin typing your search above and press return to search.
అసలు అవకాశం ఎందుకు ఉన్నట్లు కవిత?
By: Tupaki Desk | 2 July 2016 7:53 AM GMTరాజకీయ నాయకులు చెప్పే మాటలు విన్నప్పుడు నిజమే కదా..? ధర్మంగానే చెప్పారు కదా? అని అనిపిస్తుంది. అదే సమయంలోవారు చెప్పిన వాదనకు కౌంటర్ వాదన చెప్పినప్పుడే అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా తెలంగాణలో హైకోర్టు విభజన వ్యవహారం మీద రచ్చ రచ్చ జరుగుతోంది. దీనికి తోడుగా జడ్జిల నియామకం మీద కూడా రభస సాగుతోంది. ఈ ఇష్యూపై తెలంగాణ నేతలు పలువురు ఇప్పటికే మాట్లాడారు. అలా మాట్లాడిన వారిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కవిత కూడా ఉన్నారు.
ఇప్పుడామె చెబుతున్న వాదనను.. ఆమె కోణంలో విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. అదే సమయంలో.. ఆ వాదనను సాపేక్షంగా చూసి.. కౌంటర్ చెప్పే వారి మాటల్ని మనసులోకి తీసుకుంటే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. చట్టంలోని లోపాల్ని ఎత్తి చూపించే బదులు.. దానికి ఆంధ్రా కలర్ ఇచ్చి రాజకీయంగా మార్చటాన్ని చూస్తే.. సీమాంధ్రుల తెలివితక్కువతనానికి నవ్వు రాక మానదు. ఎందుకంటే తమ ప్రమేయం ఏమీ లేకుండానే.. తిట్లు తినటం సీమాంధ్రులకు మాత్రమే సాధ్యమవుతుంది మరి.
హైకోర్టు విభజన అంశాన్నే చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో కూర్చొని మాట్లాడుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికి ఒకటికి నాలుగుసార్లు చెప్పారు. అయినా.. ఏ విషయంలోనూ తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించరు. ఇక.. హైకోర్టు విభజన విషయంలో బాధ్యతంతా ఏపీదేనా? అంటే కాదని చెప్పాలి. ఇప్పటికిప్పుడు హైకోర్టును విభజన చేస్తే.. జడ్జిలను.. వారి కోర్టులను ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు చేయలేని పరిస్థితి. దీనికి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నదేమిటంటే.. తామే కొత్త భవనాల్ని చూపిస్తామని.
తమకు అవసరం కాబట్టి ఇప్పుడా మాట అంటున్నారు కానీ.. అదేదో వారే చేసుకోవచ్చుగా? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. హైకోర్టు విభజన వ్యవహారం ఇలా ఉంటే.. జడ్జిల ఆప్షన్ విధానం.. ఏపీ జడ్జిలు తెలంగాణ ఐచ్ఛికాల్ని ఎంపిక చేసుకునేది చట్టంలో ఉన్న సౌలభ్యంతో తప్పించి.. ఏపీ సర్కారో.. సీమాంధ్రులు చేసే కుట్రతో కాదు. కానీ.. కవిత లాంటి వారు మాత్రం ఇదంతా సీమాంధ్రుల కుట్రగా అభివర్ణిస్తుంటారు.
జడ్జిల నియామకాల విషయంలో ఉన్న అసలు ఇబ్బంది చూస్తే.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు సైతం హైదరాబాద్ ను ఆప్షన్ గా తీసుకోవచ్చు. దీంతో.. వారు తెలంగాణను ఆప్షన్ గా తీసుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగులకు హైదరాబాద్ లో పని చేసే అవకాశం.. అమెరికాలో పని చేసే అవకాశం ఉందంటూ రెండు ఆప్షన్స్ ఇస్తే ఎక్కువ మంది అమెరికా ఆప్షన్ ఎంపిక చేసుకోవటం ఖాయం. హైదరాబాద్ ఎంపిక విషయంలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. అయితే.. ఇలాంటి వాటికి చట్టంలో సవరణలు చేయాలే తప్పించి.. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయటం.. ఆంధ్రా వారిని తిట్టి పోయటంలో అర్థం లేదనే చెప్పాలి. ఇప్పుడు కవిత మాటల్ని చూద్దాం.
ఆమె ఏమంటున్నారంటే.. ‘‘తెలంగాణ జడ్జి పోస్టుల్లో 130 ఖాళీగా ఉన్నాయి. ఏపీలో ఖాళీగా 100 పోస్టులు ఉన్నాయి. వాటిని కాదని తెలంగాణలోని 130 పోస్టుల్లో పని చేసేందుకు ఆంధ్రావారు వ్యూహాత్మకంగా ఐచ్ఛికాలు పెట్టుకుంటున్నారు. అసలు వారు ఇక్కడే విధులను ఎందుకు కోరుకుంటున్నారు? తమ సొంత రాష్ట్రంలో పని చేయాలని ఎందుకు అనుకోకూడదు? దీని వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది’’ అని వాదిస్తున్నారు. జడ్జి పోస్టులకు అప్లై చేసే వారి వివరాలు ముందుగా సేకరించి.. వారికి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చి.. వారంతా తెలంగాణలో ఆప్షన్ పెట్టుకోవటానికి వీలుగా సిద్ధం చేస్తున్నారా? లాంటి ప్రశ్నలు వేసుకుంటే కవిత మాటల్లోని అసలువిషయం ఇట్టే అర్థమవుతుంది.
తెలంగాణ ఆప్షన్ ను పెట్టుకోవటానికి ఉన్న అవకాశం గురించి ప్రశ్నించని కేసీఆర్.. కవితలు ఆ చట్ట సవరణ మీద ఎందుకు దృష్టి పెట్టరన్నది అర్థం కాని విషయం. ఇదే అసలు రాజకీయం కూడా. ఈ రోజున తెలంగాణ నుంచి అమెరికాకు ఎంతోమంది ఉపాధి కోసం వెళుతున్నారు. మరి.. అలా వెళ్లే వారిని ఉద్దేశించి ట్రంప్ లాంటి పెద్ద మనిషి.. తమ దేశంపై తెలంగాణ రాష్ట్రం కుట్ర పన్నిందని.. తమ దేశ పౌరులకు వచ్చే అవకాశాల్ని హైదరాబాద్ కు చెందిన యువత కొట్టేస్తున్నారని.. వారందరికి వారి వారి దేశాల్లోని ప్రాంతాలు లేవా? అక్కడ బతకలేరా? అక్కడ బతకటం వదిలేసి అమెరికా మీద కుట్రతో తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నారు? వారు అసలు అమెరికాలో ఉద్యోగం చేయాలని అనుకోవటం ఏమిటి? లాంటి ప్రశ్నలు వేస్తే ఏం సమాధానం చెబుతారు..?
తమ ప్రాంతానికి చెందిన వారి ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉన్న అంశాల్ని పాజిటివ్ గా మరో ప్రాంత ప్రజల మీద ఎక్కేయటం బాగానే ఉంటుంది.కానీ.. అది మోతాదు మించకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కేసీఆర్ మొదలు కవిత అండ్ కో అంతా ఏపీ మీద పడటమే కానీ.. వాస్తవ దృష్టితో ఇష్యూను తేల్చేయాలన్నట్లుగా ఉండకపోవటం అసలు విషాదంగా చెప్పొచ్చు. తమ ప్రాంతం అంటూ వీరాభిమానాన్ని ప్రదర్శించే వారంతా.. వేరే దేశాలకు వెళ్లిన మనోళ్లకు ఇప్పుడు తాము లేవనెత్తిన మాటలే అక్కడా ఎదురైతే ఏం సమాధానం చెబుతారో..?