Begin typing your search above and press return to search.
లిక్కర్ స్కాం : కవిత పాత్ర నిజమైతే.. న్యాయనిపుణుల అంచనాలివీ
By: Tupaki Desk | 8 March 2023 9:00 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. బుధవారం ఉదయం నుంచి తెలంగాణలో ఇదో హాట్ టాపిక్ గా మారింది.నోటీసులు రావడం.. కవిత నుంచి స్పందన.. ఆ తర్వాత విచారణకు ఇప్పట్లో రాలేనని ఈడీకి లేఖ రాయడం ఇవన్నీ పెద్ద చర్చకు దారితీశాయి. చివరకు ఈనెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని ఈడీకి రాసిన లేఖలో కవిత స్పష్టం చేశారు.
ఈ నోటీసులపై ఇప్పుడు చర్చ సాగుతోంది. న్యాయనిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రముఖ న్యాయవాది రచనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వానికి లిక్కర్ స్కాం ద్వారా 3వేల కోట్లకు పైచిలుకు నష్టం వాటిల్లిందన్నారు.లిక్కర్ స్కాం అనేది పెద్ద సీరియస్ క్రైమ్ అని.. అంతకుమించిన సీరియస్ ఆధారాలు ఉన్నటువంటి నేరమన్నారు.
రాజకీయ దురుద్దేశాలతో కేసు పెట్టడం లేదని.. పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసు నడుస్తోందన్నారు. ఈ కేసులో కవిత చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారన్నారు. కవిత, రామచంద్ర పిళ్లైని ఇద్దరినీ కలిపి జాయింట్ గా విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు.
ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని తేలితే భారీగా జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా ఉండొచ్చని తెలిపారు. కవితను విచారించిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని.. పక్కాగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే విచారణకు రమ్మంటున్నారని రచనారెడ్డి తెలిపారు. ఈ న్యాయవాది కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కాస్త ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
ఇక కవిత కేసు విషయంలో ఇప్పటికే కేసీఆర్ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.