Begin typing your search above and press return to search.

ఢిల్లీలో క‌విత.. హైద‌రాబాద్‌లో అమిత్ షా.. రాజ‌కీయం హాట్‌హాట్‌!!

By:  Tupaki Desk   |   11 March 2023 12:40 PM GMT
ఢిల్లీలో క‌విత.. హైద‌రాబాద్‌లో  అమిత్ షా.. రాజ‌కీయం హాట్‌హాట్‌!!
X
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్ షా.. హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. కొన్ని అధికారిక కార్య‌క్ర మాలు స‌హా.. మ‌రికొన్ని పార్టీ కార్య‌క్ర‌మాలు ఉన్నాయ‌ని స‌మాచారం. అధికారిక కార్య‌క్ర‌మాల వివ‌రాలు మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

కానీ, పార్టీ కార్య‌క్ర‌మాలు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. స‌రే.. కీల‌క‌మైన ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తెను ఈడీ ఢిల్లీలో విచార‌ణ చేయ‌నున్న రోజే అమిత్ షా హైద‌రాబాద్‌కు రావ‌డం ఆస‌క్తిగా మారింది.

గ‌త నాలుగు రోజులుగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించి క‌వితను అరెస్టు చేస్తార‌నే వాద‌న వినిపిస్తోంది. దీనిపై అన్నింటికీ సిద్ధ‌మేన‌ని సీఎం కేసీఆర్ సైతం వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్ప‌టికే .. క‌విత స‌హా బీఆర్ ఎస్ అగ్ర‌నేత‌లు అంద‌రూ ఢిల్లీకి చేరుకున్నారు.

ఇటు.. శ‌నివార‌మే షా హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. దీంతో రాజ‌కీయంగా ఏం జ‌రుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

గ‌తంలో శార‌దా చిట్‌ఫండ్ కేసులో త‌న వారిని విచారిస్తున్న ఈడీని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. అదేస‌మ‌యంలో అమిత్ షా.. బెంగాల్ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. అయితే.. త‌మ వారిని.. త‌మ‌ను వేధిస్తున్న అమిత్‌షాను రాష్ట్రానికి రానిచ్చేది లేదంటూ.. మ‌మ‌తాబెన‌ర్జీ ఏకంగా.. షా హెలికాప్ట‌ర్‌కు లైన్ క్రియ‌ర్ చేయ‌కుండా.. చూశారు. ఫ‌లితంగా అమిత్ షా వెన‌క్కి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు తెలంగాణ‌లోనూ అదే సీన్ జ‌రుగుతుందా? లేక‌.. కేసీఆర్ దీనిని చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది చూడాల్సి ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం షా.. శ‌నివారం రాత్రి 7 గంట‌ల త‌ర్వాత‌..బేగంపేట‌కు వ‌స్తారు. త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యే అవ‌కాశం ఉంది. రేపు మాత్రం అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అదేస‌మ‌యంలో షా కూడా క‌విత అంశంపై స్పందిస్తారో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.