Begin typing your search above and press return to search.

హోం ఐసోలేషన్ కు కవిత.. సంబరాల్లో అపశృతి

By:  Tupaki Desk   |   14 Oct 2020 6:45 AM GMT
హోం ఐసోలేషన్ కు కవిత.. సంబరాల్లో అపశృతి
X
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత ఘన విజయం సాధించింది. ఆ సంబరాల్లో నేతలు, కార్యకర్తలతో కలిసి పాలుపంచుకుంది. అదే ఇప్పుడు ఆమెకు శాపమైంది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ టైంలో కవిత ప్రజల్లోకి వెళ్లడం.. నాయకులను కలవడం.. నేతలతో సన్నిహితంగా మెలగడం ఎఫెక్ట్ అయ్యింది.

కవిత ఎమ్మెల్సీ గా గెలవడంతో నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎగబడ్డారు. కానీ వారి అత్యుత్సాహం ఫలితంగా ఇప్పుడు కవిత ఇబ్బందుల్లో పడ్డారు.

తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇటీవల ఓ వేడుకకు హాజరైన సంజయ్ కు కరోనా సోకినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ గా వచ్చింది.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కవితతో సన్నిహితంగా మెలిగి ప్రచారం చేశారు. కవితకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

దీంతో ఇప్పుడు గెలిచిన సంబరాలు ముగియక ముందే కవిత హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. కవిత 5 రోజుల పాటు హోం ఐసోలేషన్ ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఎవరినీ కలవడం లేదు. ప్రస్తుతానికి అయితే కవితకు ఎలాంటి లక్షణాలు బయటపడలేదు. ఇక కవిత గెలిచాక తండ్రి, సీఎం కేసీఆర్ ను సైతం కలిచారు. దీంతో అందరిలోనూ టెన్షన్ నెలకొంది.