Begin typing your search above and press return to search.
గులాబీ సక్సెస్ కవిత ఖాతాలోనే చేర్చేశారు
By: Tupaki Desk | 6 Oct 2017 5:02 AM GMTసింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఘన విజయం సాధించింది. మొత్తం 11 డివిజన్లకు గాను తొమ్మిదిచోట్ల గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఐఎన్టీయుసీ - టీఎన్టీయూసీ తదితర సంఘాలతో ఏర్పడిన ఏఐటీయూసీ కూటమి భూపాలపల్లి - మందమర్రి ఏరియాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ పార్టీల అనుబంధ సంఘాలు ఒక్కటి అయినప్పటికీ టీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘమే మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో ఈ గెలుపు ఖాతాను తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ - నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఖాతాలో వేస్తున్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద కార్మిక సంఘం కావటంతో ప్రధాన రాజకీయపక్షాలన్నీ సింగరేణి ఎన్నికలపై దృష్టిపెట్టాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి - మల్లు భట్టివిక్రమార్క - రేవంత్ రెడ్డి - డాక్టర్ లక్ష్మణ్ - కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా - ప్రతిపక్షనేత జానారెడ్డి వంటివారు కూడా సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో తలదూర్చారు. ఇలాంటి సమయంలో మాటల తూటాలు వదిలే ఎంపీ కవిత ఒంటిచేత్తో సింగరేణి ఎన్నికల బాధ్యతను ఎత్తుకున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమయిన ఆమె ఒక్కరే ఒంటిచేత్తో అన్ని బాధ్యతలు తీసుకొని టీబీజీకేఎస్ ను విజయపథంలో నడిపారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రతి బొగ్గుబాయి వద్దకు వెళ్లి... ప్రతి కార్మికుడిలో భరోసా నింపారని చెప్తున్నారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా రాత్రింబవళ్లన్న తేడాలేకుండా కార్మికులు సమస్యల్లో ఉన్నారంటే కొత్తగూడెం నుంచి మందమర్రి వరకు క్షణాల్లో వెళ్తున్నారు. దీంతో ఆమెపై కార్మికుల్లో భరోసా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆరు జిల్లాల పరిధిలోని 11 డివిజన్లలో పర్యటించారని చెప్తున్నారు.
అధికార పార్టీ తరఫున కవిత 11 డివిజన్లలో పర్యటించారు. ఎంపీలు వినోద్ కుమార్ - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - బాల్కసుమన్ - పసునూరి దయాకర్ - సీతారాంనాయక్ - నగేశ్ తోపాటు మంత్రులు కడియం శ్రీహరి - తుమ్మల నాగేశ్వర్ రావు - ఈటల రాజేందర్ - ఇంద్రకరణ్ రెడ్డి - జోగురామన్న తదితరులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ప్రచారంలో పాల్గొన్నారు. వాస్తవానికి ప్రతిసారి బతుకమ్మ పండుగ సమయంలో తెలంగాణ జాగృతి సంస్థ తరఫున బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తుంటారు. ఈసారి సింగరేణి కార్మికులతోనే కవిత ఉత్సవాలు జరుపుకొన్నారు. ఎన్నికల ప్రచారానికే అత్యధిక సమయం కేటాయించారు. ఎంపీ కవిత కృషి ఫలించిందని అంటున్నారు.