Begin typing your search above and press return to search.
తెలుగు కాంగ్రెస్...బాబు దత్తపుత్రుడు
By: Tupaki Desk | 11 Aug 2018 4:34 PM GMTకాంగ్రెస్ పార్టీకి చేరువ అవుతున్న ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరుపై ఆయా పార్టీల నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ప్రధానప్రతిపక్షమైన వైసీపీ - వామపక్షాలు - జనసేన చంద్రబాబు తీరును తప్పుపడుతుండగా...ఆయన మిత్రపక్షంగా కొద్దికాలం కిందటి వరకు కొనసాగిన బీజేపీ సైతం ఎదురుదాడి చేస్తోంది. టీడీపీలో సీనియర్ నాయకురాలిగా కొనసాగి కొద్దికాలం కిందట బీజేపీలో చేరిన సినీనటి కవిత బాబు తీరుపై మండిపడ్డారు. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై దుమ్మెత్తిపోశారు.
కాంగ్రెస్‌ను భూస్థాపితం చెయ్యాలని కంకణం కట్టుకున్న టీడీపీని ఇప్పుడు కాంగ్రెస్ పాదాల దగ్గర చేర్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కవిత ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీతో చంద్రబాబు చేతులు కలిపారని - టీడీపీలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం కలిగిన ఎంపీలు మంత్రులు - ఎమ్మెల్యేలు చాలా బాధపడుతున్నారని ఆమె తెలిపారు. రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు - అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు వెనకనుండి వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టారని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం చేసింది చంద్రబాబేనని ఆమె ఆక్షేపించారు. తెలంగాణలో టీడీపీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారని ఆ పార్టీలో కొనసాగిన కవిత ఆరోపించారు.
``హైదరాబాద్‌లో అన్ని రకాల వసతులు ఉన్న సెక్రటేరియట్ ఉండగా అమరావతిలో రేకుల షేడ్ లో ఎందుకు ఉంటున్నారు? 23 జిల్లాలను వదిలి 13 జిల్లాలకే చంద్రబాబు ఎందుకు పరిమితం అయ్యారు?`` అని ఆమె ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో దొరికినా కూడా చంద్రబాబుకు బుద్ది రాలేదని కవిత ఆరోపించారు. ``వ్యక్తిగత డబ్బును తెలంగాణ ఎన్నికలకు ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం నిధులు ఖర్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. కాంగ్రెస్‌కు చంద్రబాబు దత్తపుత్రుడు అయ్యాడు. తెలంగాణ, ఏపీలో తెలుగు కాంగ్రెస్‌లాగా టీడీపీ మారబోతోంది. టీడీపీని కాంగ్రెస్ లో కలుపుతారు కాబట్టే రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లో చేర్చారు`` అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీని తరిమినట్లే...రాబోయే రోజులల్లో కూడా ఏపీ ప్రజలు అక్కడినుండి తరిమికొడుతారని కవిత వ్యాఖ్యానించారు. జనసేన - వైస్సార్సీపీని ఎదుర్కొనలేకే బీజేపీని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని కవిత అన్నారు.