Begin typing your search above and press return to search.

ప్రియాంక‌గాంధీ - నేను ఒక‌టి కాదంటున్న క‌విత‌

By:  Tupaki Desk   |   31 Jan 2019 12:41 PM GMT
ప్రియాంక‌గాంధీ - నేను ఒక‌టి కాదంటున్న క‌విత‌
X
తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు - నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల విష‌యంలో ఎంత క్రియాశీలంగా ఉంటారో...రాష్ట్ర - జాతీయ సంబంధ‌మైన విష‌యాల్లో కూడా అదే స్థాయిలో యాక్టివ్‌ గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. కీల‌క‌మైన అంశాల‌పై చురుగ్గా స్పందించే క‌విత తాజాగా ట్విట్టర్‌ లో ఆస్క్ ఎంపీ కవిత పేరుతో నిర్వ‌హించిన‌ కార్య‌క్ర‌మంలో ప‌లు అంశాల‌పై స్పందించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంద‌ని అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ గ్రాఫ్ పైకి రావడం లేదన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని - 2019 తర్వాత ఆ పార్టీలదే హవా ఉంటుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌ కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ తెలంగాణలో మార్పు తెచ్చినట్టుగానే దేశవ్యాప్త మార్పుకోసం ముందుకుసాగుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎజెండా పీపుల్స్ ఎజెండా అని ఎంపీ కవిత అన్నారు.

కాంగ్రెస్‌కు 70 ఏళ్లు అధికార మిచ్చినా ఏమీ చేయలేదని ఎంపీ క‌విత వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రియాంక గాంధీది అతిథి పాత్ర అని ఆమె ఎద్దేవా చేశారు. త‌ల్లి కోసం - అన్న కోసం గెస్ట్‌ రోల్‌ గా వచ్చి తిరిగి వెళ్లిపోతుందని జోస్యం చెప్పారు. తాను రాజ‌కీయాల్లోనే కొనసాగుతాన‌ని అన్నారు. ``చిన్నప్పుడు నర్సులు - వారి డ్రెసింగ్ - సేవలు చూసి నర్సును కావాలని అనుకునేదాన్ని. తర్వాత వ్యాపారంలో రాణించే మహిళగా ఎదుగాలనుకున్నా. అనంతరం చదువులు - అమెరికా.. అక్కడ వ్యాపారం నిర్వహించా. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో ఉద్యమంలోకి అడుగుపెట్టా. ఉద్యమం రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. ఇందులో మాత్రం నాకు రిటైర్‌ మెంట్ లేదు`` అని ప్ర‌క‌టించారు.

కుటుంబ పాల‌న అంటూ వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఆమె ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ``కేసీఆర్ కుటుంబసభ్యులు ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వారి పనితీరును ఎన్నికల్లో ప్రజలే ఇస్తారు. అన్నగా కేటీఆర్‌ కు పదికి పది మార్కులిస్తా. పొలిటికల్ లీడర్‌ గా అయితే ప్రజలే ఆయ‌న ప‌నీతిరును మెచ్చుకుంటున్నారు.`` అని వెల్లడించారు. నాలుగున్న‌రేళ్ల‌లో ఎంపీగా త‌న ప‌నితీరును సంతృప్తిగా ఉంద‌న్నారు.