Begin typing your search above and press return to search.
మోడీపై మరో తీవ్ర విమర్శ చేసిన కవిత
By: Tupaki Desk | 2 April 2023 7:11 PM GMTకొద్దిరోజులుగా బీజేపీపై ఫైట్ చేస్తున్న కవిత.. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. కేంద్రంలోని బీజేపీ విధానాలను తూర్పారపడుతూనే ఉంది. తాజాగా మరోసారి మోడీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కవిత ప్రశ్నించారు. నిజమైన డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నవాళ్లకు దేశంలో ఉద్యోగాలు రావని.. కానీ డిగ్రీ లేని వాళ్లకు మాత్రం దేశంలోనే అత్యున్నత ఉద్యోగం ఉందని మోడీని ఉద్దేశించి కవిత పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8శాతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ కేంద్రప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. మోసపూరిత దేశ యువతను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దగా చేసిందని విమర్శించారు.
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మోడీ విద్యార్హతకు సంబంధించి కోర్టులో పిటీషన్ వేయగా కోర్టు జరిమానా విధించింది.
మోడీ విద్యార్మతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపైనే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ తీర్పుతో ప్రధాని మోడీ విద్యార్హత విషయంలో తమ అనుమానం మరింత పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మోడీ విద్యావంతుడు అయితే పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయాలు తీసుకొని ఉండకపోయి ఉండేవారని విమర్శించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.