Begin typing your search above and press return to search.
తండ్రిని తొలిసారి విమర్శించిన కవితక్క
By: Tupaki Desk | 11 July 2015 8:56 AM GMTవిషయం ఏదైనా కానీ.. తన వారి మీద ఈగ కూడా వాలనివ్వని కవితక్క.. తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విమర్శ మాదిరిగా చేసిన ఆమె వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సర్కారులో మహిళలకు ప్రాతినిధ్యం లేదన్న విషయంపై ఆమె సానుకూలంగా స్పందించటమే కాక.. తప్పును ఎత్తి చూపిన వారి మాటను సమర్థించటం.. తండ్రి నిర్ణయంపై కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేయటం పెద్ద విషయంగానే చెప్పాలి. ప్రతి విషయానికి తనదైన శైలిలో ఎదురుదాడి చేసే ఎంపీ కవితక్క అందుకు భిన్నంగా నిజమే సుమా.. అంటూ కాస్తంత నిరాశను వ్యక్తం చేయటం గమనార్హం.
హైదరాబాద్‌లోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఒకరు ప్రశ్నిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సర్కారులో మహిలలకు చోటు దక్కకపోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. అలా ప్రశ్న అడిగిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా.. వివిధ సమీకరణాల కారణంగా కేబినెట్‌లో మహిళలకు చోటు దక్కలేదన్న విషయాన్ని వివరిస్తూనే.. ఇలాంటి పరిస్థితి కాస్తంత నిరాశ కలిగించేదన్నట్లుగా వ్యాఖ్య చేయటం విశేషం. మొత్తానికి తండ్రి నిర్ణయాన్ని ఇప్పటివరకూ విపక్షాలు.. వివిధ సంఘాలు మాత్రమే తప్పు పట్టాయి. తాజాగా.. ఆ జాబితాలో కవిత్క కూడా చేరారన్న మాట.