Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఆరోగ్యం గురించి క‌విత ఏం చెప్పిందంటే

By:  Tupaki Desk   |   12 July 2016 8:59 AM GMT
కేసీఆర్ ఆరోగ్యం గురించి క‌విత ఏం చెప్పిందంటే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయ‌న కూతురు - నిజామాబాద్ ఎంపీ క‌విత ఆస‌క్తిక‌రంగా వివ‌రించారు. అమెరికాలో జ‌రుగుతున్న ఆటా సంబ‌రాల్లో పాల్గొనేందుకు అక్క‌డికి వెళ్లిన సందర్భంగా క‌విత‌ ప్ర‌సంగిస్తూ ఆరోగ్య కారణాల రీత్యానే సీఎం కేసీఆర్ అమెరికా రాలేద‌న్నారు. త‌న త‌ల్లి వ‌చ్చిన విష‌యాన్ని ఈ సందర్భంగా క‌విత ప్ర‌స్తావించారు.

అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌(ఆటా) స్వ‌ర్ణోత్స‌వాలు - అమెరిక‌న్ తెలంగాణ అసోసియేష‌న్ (ఆటా తెలంగాణ‌) సంబ‌రాల నేప‌థ్యంలో క‌విత అమెరికా వెళ్లారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లిని కూడా వెంట‌బెట్టుకువెళ్లారు. అయితే ఈ రెండు వేదిక‌ల్లో క‌విత మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. కేసీఆర్ స‌తీమ‌ణి వెళ్ల‌లేదు. దీంతో ప‌లువురు సీఎం స‌తీమ‌ణి శోభ గైర్హాజ‌రి గురించి ఆరాతీశారు. ఒక్కొక్క‌రికీ చెప్పేబ‌దులుగా వేదిక మీద‌నుంచే క‌విత క్లారిటీ ఇచ్చారు. త‌న త‌ల్లికి లో ప్రొఫైల్ మెయింటెన్ చేయ‌డం ఇష్టమ‌ని అందుకే ఆమె వేడుక‌ల‌కు రాలేద‌ని చెప్పారు. త‌న ఒత్తిడి మేర‌కు అమెరికా వ‌చ్చార‌ని తెలిపారు. ఇక కేసీఆర్ ఆరోగ్యం గురించి కూడా జ‌రుగుతున్న చ‌ర్చ త‌నకు తెలుస‌ని కవిత వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమెరికా రాక‌పోవ‌డం వెనుక ఆయ‌న ఆరోగ్యంపై జ‌రిగిన ప్ర‌చారమే కార‌ణ‌మ‌ని క‌విత అన్నారు. తెలుగువారితో మ‌మేకం అయ్యేందుకు త‌న తండ్రి కేసీఆర్ అమెరికా వ‌స్తే గ‌తంలో సాగిన‌ట్లే... #ఆరోగ్యం బాగు చేయించుకునేందుకే అమెరికా వెళ్లారు. ఆప‌రేష‌న్ చేయించుకుంటారు అనే ప్ర‌చారం సాగుతుంది. అందుకే అలాంటి అన‌వ‌స‌ర ప్ర‌చారాన్ని దూరం పెట్టేందుకు ఈ వేడుక‌ల‌కు కేసీఆర్‌ రాలేదు అంటూ క‌విత క్లారిటీ ఇచ్చారు. ఆటా వేడుక‌ల‌కు రాన‌ప్ప‌టికీ ఎన్నారైల అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం ఎప్పుడూ స‌హ‌క‌రిస్తుంటుంద‌ని తెలిపారు.