Begin typing your search above and press return to search.

కవిత కేసు మార్చ్ 27 వరకు సస్పెన్స్

By:  Tupaki Desk   |   24 March 2023 1:41 PM GMT
కవిత కేసు మార్చ్ 27 వరకు సస్పెన్స్
X
ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 27న విచారించనుంది. దిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణకు సంబంధించిన ఈ పిటిషన్ శుక్రవారం(మార్చి 24)న విచారణకు వస్తుందని భావించినప్పటికీ జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన బెంచ్ ఈ కేసును మార్చి 27న వినేందుకు లిస్ట్ చేశారు.

కాగా కవిత మార్చి 14న ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అర్జెంటుగా విచారణకు చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరారు. కానీ, వారి వినతిని కోర్టు తిరస్కరించింది. మార్చ్ 24న వింటామని బెంచ్ తెలిపింది.

కోర్టు ఈ పిటిషన్‌ను మార్చ్ 24న వింటానని చెప్పడంతో కవిత మార్చ్ 16న జరగాల్సిన తన విచారణకు గైర్హాజరయ్యారు. మార్చ్ 24న కేసు తేలేవరకు విచారణకు రానని చెప్పారు. కానీ, ఈడీ అలా కుదరని చెప్పడంతో మార్చి 20, 21 తేదీలలో మళ్లీ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మార్చ్ 27న కవిత పిటిషన్ విచారణకు రానుండడంతో కోర్టు ఏం చెప్తుందా అనే ఆసక్తి అంతటా నెలకొంది.

దిల్లీ లిక్కర్ కేసులో ఎప్పుడేం జరిగింది?

నవంబర్ 17, 2021: దిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది.
జులై 31, 2022: అవకతవకల ఆరోపణలు రావడంతో కొత్త పాలసీని రద్దు చేశారు.
అగస్ట్ 17, 2022: సీబీఐ కేసు నమోదు చేసింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతోపాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు.
అగస్ట్ 22, 2022: మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది.
డిసెంబర్ 11, 2022: కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించింది.
మార్చి 11, 2023: తొలిసారి కవితను ఈడీ విచారించింది.
మార్చి 16, 2023: ఈడీ విచారణకు కవిత వెళ్లలేదు.
మార్చి 20, 2023: ఈడీ విచారణకు మరొకసారి కవిత వెళ్లారు.
మార్చి 21, 2023: వరుసగా రెండోరోజు కవిత విచారణ.
మార్చి 24, 2023: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ 27కి వాయిదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.