Begin typing your search above and press return to search.
ఒక్క ట్వీట్ తో ఫుల్ జోష్ తెచ్చిన కవిత.. సోషల్మీడియాలో అదిరిపోయే వీడియో!
By: Tupaki Desk | 18 Nov 2020 10:50 AM GMTనిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొంతకాలం సైలంట్ అయిపోయారు. నిజామాబాద్ జిల్లా నేతలతో కూడా ఆమె పెద్దగా టచ్ లో లేరు. కొంతమంది పార్టీ ముఖ్య నాయకులతో మాత్రమే మాట్లాడేవారు. పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఓడిపోయాక ఆమెకు ఎమ్మెల్సీ ఇస్తారని ఆ తర్వాత మంత్రిని చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కొంతకాలం పాటు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు సాగలేదు. కవిత కూడా అప్పుడప్పుడు మాత్రమే మీడియాతో మాట్లాడేవారు. కానీ అందరూ ఊహించినట్టుగానే చివరకు సీఎం కేసీఆర్ నిజామాబాద్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను పోటీచేయించారు. కవిత భారీ మెజార్టీతో గెలుపొందారు.
అయితే ఆ తర్వాత తెలంగాణలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగబోతున్నదని.. ఇద్దరు మంత్రులను పక్కనపెట్టబెట్ట బోతున్నారని కవితకు క్యాబినెట్లో బెర్త్ కన్ఫార్మ్ అయిందన్న వార్తలు వినిపించాయి. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. కానీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎమ్మెల్సీ కవిత మరోసారి యాక్టివ్ అయ్యారు. బుధవారం ట్విట్టర్ లో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిపించాలని ప్రజలను కోరారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలందరకూ తెలుసన్నారు. అభివృద్ది కొనసాగాలంటే ప్రజలు టీఆర్‌ఎస్ కే ఓటేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ మహానగరంలో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే పరిస్థితులు, 24 గంటల కరెంటు, శాంతిభద్రతలు.. ఇవన్నీ సీఎం కేసీఆర్ - టీఆర్‌ఎస్ పార్టీ కారణంగానే ఇంత గొప్పగా ఉన్నాయన్నారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూాడా నగరానికి వచ్చాయన్నారు. ఈ నాయకత్వాన్ని ఇలాగే కొనసాగించే బాధ్యత హైదరాబాద్ ప్రజలపై ఉందన్నారు. నగరం వరుసగా ఐదేళ్లుగా ఇండియాలో బెస్ట్ సిటీగా ఉందని మర్సర్ వంటి ఇంటర్నేషనల్ ఏజెన్సీలు కూడా చెబుతున్నాయన్న విషయాన్ని కూడా కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత దుబ్బాక ఎన్నికల్లో సోషల్మీడియా ఎఫెక్ట్ తోనే టీఆర్ ఎస్ నష్టపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సారి టీఆర్ ఎస్ కూడా సోషల్ మీడియాలో క్రియాశీలకపాత్ర పోషించనున్నది. ఇప్పటికే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సోషల్మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వారికున్న అవకాశాలను వాడుకొని ఈ సారి మరింత ముమ్మరంగా ప్రచారం చేయబోతున్నారు.