Begin typing your search above and press return to search.
జగన్ అన్న..జన్మదిన శుభాకాంక్షలు
By: Tupaki Desk | 21 Dec 2018 5:35 PM ISTఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 47వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నేతలు - కార్యకర్తలు - అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే, వైసీపీ అధినేత జన్మదినం సందర్భంగా ఆయనకు సర్ ప్రైజ్ శుభాకాంక్షలు వచ్చాయి. టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'జగన్ అన్న.. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే' అని కవిత ట్వీట్ చేశారు. జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపమని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు స్పందిస్తూ.. ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
తెలంగాణ ఎంపీ కవిత ట్వీట్ కు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు. 'థ్యాంక్యూ ఫర్ యువర్ వామ్ విషెస్ కవితమ్మ ' అని జగన్ రీట్వీట్ చేశారు. కాగా, వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా టీఆర్ ఎస్ అధినేత తనయ శుభాకాంక్షలు తెలపడం కొత్త రాజకీయ పరిణామాలకు తార్కాణమా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.