Begin typing your search above and press return to search.

కవిత యాక్టివ్ వెనుక కారణం అదేనా?

By:  Tupaki Desk   |   30 Jun 2020 9:45 AM GMT
కవిత యాక్టివ్ వెనుక కారణం అదేనా?
X
గత ఏడాది జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ కూతురు.. మాజీ ఎంపీ కవిత సైలెంట్ అయిపోయారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరిగారు. ఇక తను ప్రాతినిధ్యం వహిస్తున్న సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు.

అయితే తాజాగా ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కవిత మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టారట.. టీఆర్ఎస్ అనుబంధం బొగ్గు గని కార్మిక సంఘం బాధ్యతలను మళ్లీ స్వీకరించారు. టీఆర్ఎస్ నేతలంతా కార్మిక సంఘాలతో అనుబంధాన్ని తెంచుకోవాలన్న కేసీఆర్ ఆదేశాలతో గత జనవరిలో కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష బాధ్యతలు వదిలేసిన కవిత ఇప్పుడు మళ్లీ సింగరేణిలో ఎన్నికల నేపథ్యంలో అందుకున్నారు. తాజాగా బీజేపీపై ఫైట్ మొదలుపెట్టారు.

బొగ్గు బ్లాకులన్నింటిని ప్రైవేటీకరించిన కేంద్రంలోని బీజేపీపై వ్యతిరేక ఉద్యమాన్ని కవిత చేపట్టారు. సింగరేణి వ్యాప్తంగా కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు ఒకరోజు సమ్మెకు కూడా కవిత సింగరేణిలో పిలుపునివ్వడం విశేషం.

నిజామాబాద్ లో తనను ఓడించిన బీజేపీపై కోపంతో రగిలిపోతున్న కవిత.. తాజాగా అదే బీజేపీ నిర్ణయంపై సింగరేణిని కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. కవిత సింగరేణిలో ఎంట్రీతో కార్మికుల్లో జోష్ వచ్చేసింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బొగ్గు గనుల ప్రైవేటీకరణపై జాతీయ కార్మిక సంఘాలు తాజాగా ఏకమయ్యాయి. జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళన చేస్తున్నాయి. ఈనెల 18న సమ్మె నోటీసు ఇచ్చాయి. జూలై 2 నుంచి మూడు రోజులు సమ్మె చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే టీబీజీకేఎస్ బాధ్యతలు తీసుకున్న కవిత వచ్చే సింగరేణి యూనియన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలంటే ఇప్పుడు సమ్మెపై సీరియస్ గా వెళ్లాలని డిసైడ్ అయ్యింది. సింగరేణిలో టీఆర్ఎస్ సంఘం దెబ్బతింటే అది కనీసం 17 నియోజకవర్గాలపై ఉత్తర తెలంగాణలో ప్రభావం చూపుతుంది. అందుకే కవితను రంగంలోకి దించింది టీఆర్ఎస్ అధిష్టానం..

దీంతో అనూహ్యంగా కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీపై కవిత అస్త్రాన్ని గులాబీ దండు దించుతోంది. ముందుగా సింగరేణినుంచే బీజేపీపై దాడిని కవిత మొదలుపెడుతోంది. అటు సింగరేణి టీఆర్ఎస్ సంఘాన్ని నిలబెట్టడం.. ఇటు బీజేపీని ఎదుర్కొనే దిశగా కవిత మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతున్నారు.