Begin typing your search above and press return to search.
కొత్త సీజన్ లో కోటి ప్రైజ్ మనీని సొంతం చేసుకున్న తొలి మహిళ
By: Tupaki Desk | 7 Nov 2020 12:15 PM ISTఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఇరవై సంవత్సరాలుగా టీవీలో ఒక షోకు ఆదరణ చెక్కు చెదరకుండా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఆ రికార్డును సొంతం చేసుకుంది కౌన్ బనేగా కరోడ్ పతి. తాజాగా 12వ సీజన్ నడుస్తోంది. కొత్త సీజన్ లో కోటి రూపాయిల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన కమ్యునికేషన్ మేనేజర్ నజియా నసీమ్.. తాజా సీజన్ లో కోటి మొత్తాన్ని సొంతం చేసుకున్న వైనాన్ని సోనీ చానల్ వెల్లడించింది.
ఆమె ఆట ఆడిన తీరుకు బిగ్ బీ అమితాబ్ ఆమెనుప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె చెప్పిన కోటీ రూపాయిల ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఏక్ కరోడ్ అంటూ తన గంభీర స్వరంతో అమితాబ్ ప్రకటించారు. దీంతో.. విజేతగా నిలిచిన నజియా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అమితాబ్ మాటల్ని నమ్మలేనట్లుగా అలా ఉండిపోయారు. కొన్ని సెకన్లలో కోలుకున్న ఆమె.. సంతోషం తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
తాజా సీజన్ గత నెల 28న మొదలైంది. కరోనా నేపథ్యం లో ఈ సీజన్ లో చాలానే మార్పులు చేశారు. ఈసారి ఆడిషన్స్ ఆన్ లైన్ లో తీసుకున్నారు. అంతేకాదు.. తొలిసారి ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్ ఎత్తేశారు. ఇలా..సీజన్ మొదలైన తొలి నాళ్లలోనే కోటి రూపాయిల ప్రైజ్ మనీని గెలుచుకున్న నజియా కు అభినందలు చెబుదామా?