Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియాను కుదిపేస్తున్న 'కౌన్ బ‌నేగా 40 క‌రోడ్‌' ప్ర‌శ్న‌!

By:  Tupaki Desk   |   25 Feb 2023 1:08 PM GMT
సోష‌ల్ మీడియాను కుదిపేస్తున్న కౌన్ బ‌నేగా 40 క‌రోడ్‌ ప్ర‌శ్న‌!
X
కొన్ని కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. ముఖ్యంగా రాజ‌కీయాలు అయితే.. ఏ న‌లుగురు గుమిగూడినా వీటిపైనే చ‌ర్చ‌. ఇక‌, తాజాగా ఏపీలో ఏ ఇద్ద‌రు జ‌త‌క‌లిసినా.. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వివేకా నంద‌రెడ్డి హ‌త్య విష‌యాన్ని ప‌దేప‌దే చ‌ర్చించుకుంటున్నారు. ఎందుకంటే. గ‌త నాలుగు రోజులుగా మీడియాలో ఈ కేసు గురించిన చ‌ర్చే ఎక్కువ‌గా సాగుతోంది. ఇక తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ రెండో సారి కూడా విచారించింది.

ఆయ‌న విచార‌ణ ఏకంగా నాలుగున్న‌ర గంట‌ల‌పాటు సాగింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇది కూడా నిజ‌మే. అవినాష్ సీబీఐ కార్యాల‌యం లోప‌లికి వెళ్లిన నాటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు సుమారు నాలుగున్నర గంట‌ల పాటు విచార‌ణ జ‌రిగింది. దీంతో లోప‌ల ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, ఈ వివేకా కేసులో కీల‌క‌మైన వ్య‌వ‌హారం.. ఆయ‌న‌ను మ‌ర్ద‌ర్ చేస్తే.. 40 కోట్ల రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పిన 'ఆఫ‌ర్‌'

ఈ కేసులో.. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ఫ‌స్ట్ ఆఫ్ ఫ‌స్ట్‌.. దీనిని వెల్ల‌డించిన విష‌యంతెలిసిందే. దీంతో తాజాగా సీబీఐ.. ఇదే ప్ర‌శ్న అవినాష్‌కు సంధించింది. ఈ హ‌త్య‌కు ఆ 40 కోట్ల‌కు సంబంధం ఏంటి? ఎవ‌రు స‌మ‌కూర్చారు? ఎవరెవ‌రి ప్ర‌మేయం ఉంది? ఎవ‌రు దీనికి బాధ్యలు.. అనే విష‌యాన్ని కూడా ప్ర‌శ్నించింది. అదేస‌మయంలో సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి పీకే.. న‌వీన్ వ్య‌వ‌హారాన్ని కూడా సీబీఐ కూపీ లాగిన‌ట్టు తెలిసింది.

అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో 40 కోట్ల వ్య‌వ‌హారం అత్యంత కీల‌కంగా మారింది. ఇక ఈ ప్ర‌శ్న‌ను ప‌దే ప‌దే సీబీఐ అధికారులు అవినాష్‌పై సంధించార‌ని తెలియ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ ప్ర‌శ్నే ట్రెండింగ్‌గా మారింది. "కౌన్ బ‌నేగా 40 క‌రోడ్‌" అనే కామెంట్లు వెల్లువెత్త‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. "ఓ ప‌నిచేస్తావా.. 40 రూపాయ‌లు ఇస్తా!!" అనే వ్యంగ్యాస్త్రాలు కూడా వాట్సాప్ స్టేట‌స్‌ల‌లో గిలిగింత‌లు పెట్టాయి. మొత్తానికి వివేకా కేసు.. ఎటు మ‌లుపుతిరుగుతుందో కానీ, ఆద్యంతం మాత్రం ఆస‌క్తిగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.